Home / maha sivaratri
పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ‘మహాశివరాత్రి’. ఈ పర్వదినాన, శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు మహా శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పలు రాష్ట్రాల్లోనూ మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉండే కోటప్పకొండ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కోటప్పకొండ సమీపంలోని గ్రామాలకు చెందిన వారు.. ప్రభలు కట్టుకుని కొండకు వెళ్లి శివయ్యను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే భక్తులు శైవక్షేత్రాల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి శివనామస్మరణ చేస్తున్నారు.
మహా శివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం పుణ్య క్షేత్రం సిద్దమైంది. ఈ మేరకు శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.