Published On:

LSG Vs SRH: రాణించిన లక్నో ఓపెనర్లు.. హైదరాబాద్ లక్ష్యం 206.!

LSG Vs SRH: రాణించిన లక్నో ఓపెనర్లు.. హైదరాబాద్ లక్ష్యం 206.!

SRH Target is 206 against LSG:  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్ణిత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్లు  చెరో అర్థ సెంచరీని తమ ఖాతాలో వేసుకున్నారు.  మిచెల్ 39 బంతుల్లో 65 పరుగులు చేయగా, మరో ఎండ్ లో ఉన్న ఆదిన్ 38బంతుల్లో 61 పరుగులు చేశారు. మిచెల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన పంత్ ఎప్పటిలాగే తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. 6బంతులాడి 7 పరుగులు చేశాడు. ఆతర్వాత వచ్చిన పూరన్ ఆచితూచి ఆడాడు అవసరం వచ్చిన వెంటనే బౌండరీ బాదాడు. పూరన్ 26 బంతుల్లో 45 పరుగులు చేశాడు. బదోని 5బంతులకు 3 పరుగులుచేశాడు.

 

హైదరాబాద్ బౌలర్లలో..  ఇషాన్ మలింగా రెండు వికెట్లు తీయగా, హర్షల్ పటేల్, హర్ష్ దుబే, రెడ్డీ చెరో వికెట్ తీశారు.

 

లక్నో:  మిచెల్ 39 బంతుల్లో 65 పరుగులు, ఆదిన్ 38బంతుల్లో 61 పరుగులు, పంత్ 6బంతులాడి 7 పరుగులు, నికోలస్ పూరన్ 26 బంతుల్లో 45 పరుగులు, బదోని 5బంతులకు 3 పరుగులు, సమద్ 6 బంతులకు 3 పరుగులు, శార్దూల్ ఒక బంతికి 4 పరుగులు, ఆకాశ్ ఒక బంతికి 6 పరుగులు చేశారు.

ఇవి కూడా చదవండి: