Published On:

Makhana for Kidney Health: కిడ్నీ సమస్యలు ఉన్న వారు మఖానా తినొచ్చా?

Makhana for Kidney Health: కిడ్నీ సమస్యలు ఉన్న వారు మఖానా తినొచ్చా?

Makhana for Kidney Health: మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లైఫ్ స్టైల్‌లో అనేక రకాల మార్పులను చేసుకుంటాం. ఇందుకోసం చాలా మంది డ్రై ఫ్రూట్స్ కూడా తింటూ ఉంటారు. మఖానాలు కూడా డ్రై ఫ్రూట్స్‌గా చెబుతారు. శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో మఖాన ఉపయోగపడుతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు మఖానాలో లభిస్తాయి. ఇదిలా ఉంటే కిడ్నీ సమస్యలు ఉన్న వారు మఖానా తినవచ్చా లేదా అనేది సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..

 

మఖానాలోని పోషకాలు:

ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి2, బి6 వంటి పోషకాలు మఖానాలో ఉంటాయి . ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వాపును తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియ, ఎముకలు, జీవక్రియకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

 

కిడ్నీ రోగులు మఖానా తినొచ్చా?

మీరు కూడా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. మఖానా తీసుకోవడం వల్ల కిడ్నీకి మేలు జరుగుతుందో లేదో తెలుసుకోవడం ముఖ్యం . మీరు మూత్రపిండాల్లో రాళ్ళు లేదా ఇతర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే.. మీరు మఖానా తినకుండా ఉండాలి. కమల గింజలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది కాబట్టి మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు మఖానా తింటే కీడ్నీలో రాళ్లు పెరుగుతాయి.

 

దీంతో పాటు.. మఖానా తినడం వల్ల మూత్రంలో కాల్షియం పరిమాణం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఇతర మూత్రపిండాల సంబంధిత సమస్యలు కూడా తీవ్రంగా మారతాయి. మఖానాలో ప్రోటీన్, పొటాషియం, భాస్వరం కూడా ఉంటాయి. ఇది మూత్రపిండాలకుహానికరం. కాబట్టి, మీరు మఖానా తినాలనుకుంటే, ముందుగా డాక్టర్ ని సంప్రదించండి.

 

మఖానా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:

-మఖానాలో మంచి మొత్తంలో ప్రోటీన్ , ఫైబర్ ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

-మఖానాలో ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

-మఖానాలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

-మఖానాలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

-మఖానాలో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.