Home / Commonwealth Games 2022
కామన్వెల్త్ క్రీడల్లో చివరి రోజూ భారత క్రీడాకారులు అదరగొట్టారు. వెయిట్‌లిఫ్టర్లు, రెజ్లర్లు, బాక్సర్ల తరహాలోనే షట్లర్లు సైతం చక్కటి ప్రదర్శన చేయడంతో బర్మింగ్‌హామ్ క్రీడలను భారత్ ఘనంగా ముగించింది. చివరి రోజు మరో నాలుగు స్వర్ణాలు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. అందులో మూడు బ్యాడ్మింటన్‌లో వచ్చినవే.
కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని సింధు ఓడించింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు.. రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో భారత షట్లర్ కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి పసిడిని ముద్దాడింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ సత్తా చాటారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా, మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
కామన్వెల్త్ మహిళా క్రికెట్ కీలక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బార్బడోస్‌ను చిత్తుగా ఓడించి గ్రూప్-A నుంచి సెమీస్‌కు దూసుకెళ్లింది. బ్యాటింగ్‌లో రోడ్రిగ్స్ 56 పరుగులతో నాటౌట్, బౌలింగ్‌లో రేణుకా సింగ్ 4 వికెట్లతో విజృంభించిన వేళ భారత్ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతుంది. ఐదో రోజు భారత్ అదరగొట్టింది. రెండు స్వర్ణాలు, రెండు రజతాలు ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్ 5 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది.