Home / Chandrababu
చంద్రబాబు తెలుగుదేశం బలోపేతానికి వయసుకి మించి శ్రమిస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రోడ్డుషోల్లో పోయిన ప్రాణాల గురించి పెను దుమారం నడుస్తున్న తరుణంలో ఆయన ప్రస్తుత చర్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
రాజకీయ దుమారం రేపుతున్న కందుకూరు, గుంటూరు మరణాలపై చంద్రబాబు పోలిసులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 11 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
నేను సీఎంగా ఉన్నప్పుడు నేనలా అనుకుంటే ఆనాడు జగన్ పాదయాత్ర చెయ్యగలిగేవాడా.. జీవో నెంబర్ 1 తీసుకురావడం ఏంటి ప్రజలను కలవడానికి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఇన్ని పర్మిషన్లా.. దేశంలో ఎక్కడైనా ఇన్ని ఆంక్షలు ఉన్నాయా అంటూ చంద్రబాబు జగన్ సర్కారును ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
2022 వైసీపి ప్రభుత్వానికి విజయ నామ సంవత్సరం అని మంత్రి జోగి రమేష్ అన్నారు. 2022 చంద్రబాబుకు బూతుల నామ సంవత్సరంగా మారిందంటూ ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇదేం ఖర్మ రాష్ట్రానికి సభ నిర్వహించారు. కాగా ఈ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో టిడిపి అధినేత చంద్రబాబు రీ ఎంట్రీ పై బిఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయా.. చంద్రబాబు రాకపై బిఆర్ఎస్ ఉద్యమ నేతలు ఎదురుదాడి చేస్తోంటే.. పాత టిడిపి నేతలు సాఫ్ట్ కార్నర్ తో వున్నారా..
ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఢిల్లీకి పయనమవుతున్నారు. తదుపరి జీ20 సదస్సు నిర్వహణ బాధ్యతలు భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి పలువురు నేతలకు ప్రధాని ఆహ్వానం లభిచిందింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సీఎంలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు, బీసీ నేత అయిన అయ్యన్నపాత్రుడి అరెస్ట్ విషయంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో పవన్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించిన తీరు చాలా దారుణమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నేను పవన్ తో మాట్లాడాలి, తనను పరామర్శించాలి అనుకున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యమంటే ఇదేనా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.