Home / Union Budget 2023-24
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న యూనియన్ బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టనున్నారు.
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి కేంద్ర వార్షిక బడ్జెట్ పై సాధారణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా కరోనా కష్టాలను ఎదుర్కొన్న ప్రజలకు ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి హామీలు లభిస్తాయో అని చెల్లింపు దారులు ఎదురు చూస్తున్నారు.
New Parliament Building: దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ ( New parliament Building)అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది. ఈ నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను కేంద్రం రిలీజ్ చేసింది. కొత్త పార్లమెంట్ భవనం ఎన్ని హంగులతో నిర్మాణమవుతుందో ఈ ఫొటోలను చూస్తే అర్ధమవుతుంది. విశాలమైన హాళ్లు..అత్యాధునిక హంగులు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా రీడెవలప్ మెంట్ ప్రణాళికలో భాగాంగా ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తోంది. టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ పనులు చేపడుతోంది. […]
Nirmala Sitharaman: కేంద్ర వార్షిక బడ్జెట్ (2023-2024) సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో నిర్మలా సీతరామన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్ఎస్ఎస్ కు చెందిన ‘పాంచజన్య’మ్యాగజైన్ నిర్వహించిన కార్యక్రంలో ఆమె పాల్గొన్నారు. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్య తరగతి పై కొత్తగా ఎలాంటి పన్నులు వేయలేదు. నేను మధ్యతరగతి నుంచే వచ్చాను.. […]
రాబోయే కేంద్ర బడ్జెట్లో సుమారు 300 నుండి 400 కొత్త వందే భారత్ రైళ్లను ప్రకటించవచ్చని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2024 మొదటి త్రైమాసికంలో స్లీపర్ కోచ్‌లతో కూడిన మొదటి వందే భారత్ రైలును విడుదల చేయనున్నట్లు చెప్పారు.