Home / AP
Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో రెండో రోజు శాకంబరీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభం కాగా.. రేపటి వరకు జరగనున్నాయి. ఈ మేరకు మూడురోజులు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి ఏటా ఆషాడ మాసంలో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరిస్తారు. ఈమేరకు వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని, ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దుతారు. ఈ నేపథ్యంలో దుర్గమ్మ ఆలయాన్ని, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, […]
Chittoor District: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులతో వైఎస్ జగన్ మాట్లాడతారని, మామిడి రైతుల ఇబ్బందులను తెలుసుకోవడానికి జగన్ వస్తున్నారని, అక్కడ ఎలాంటి బహిరంగ సభ నిర్వహించేదిలేదని వైసీపీ నేతలు చెప్తున్నారు. కానీ జగన్ పర్యటనపై, వైసీపీ నేతల తీరుపై పోలీసులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 500 మందికి మించకుండా జగన్ పర్యటన నిర్వహించాలని […]
YS Jagan Kadapa Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజులపాటు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 3.30 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరి 5.15 గంటలకు పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు. రాత్రి పులివెందులలో బస చేస్తారు. […]
Heavy Flood: ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. దీంతో జలాశయం దాదాపు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన ఉన్న సుంకేశుల, జూరాల ప్రాజెక్టుల నుంచి 1 లక్షా 71 వేల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ కు వస్తోంది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా ప్రాజెక్ట్ నుంచి 67,399 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం […]
Andhra and Telangana states Expected rains for coming 3 days: నైరుతి రుతుపవనాలు విస్తరించడంతోపాటు.. బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాగల మూడు రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఉత్తర గుజరాత్, ఉత్తర మధ్యప్రదేశ్, ఆగ్నేయ […]
Gudivada: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఇవాళ గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ముందస్తు బెయిల్ లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన సంతకాలు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నానికి గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కొడాలి నాని ఇవాళ పీఎస్ […]
Markapuram As New District: రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతోంది. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అందుకు తగ్గట్టుగానే మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కట్టుబడి ఉంది అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రకాశం జిల్లాలో రూ. 165 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించామని చెప్పారు. […]
Heavy Flood: ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ కు వరద పెరుగుతోంది. ప్రాజెక్ట్ కు సుమారు 90 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 10 గేట్లను ఎత్తి 66,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,635 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్-1 ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ ద్వారా 315 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 550 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్ కు 150, బీమా […]
Kurnool District: కర్నూలు జిల్లాలో వజ్రాల వేట జోరుగా సాగుతోంది. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో పెద్దసంఖ్యలో ప్రజలు, రైతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల కోసం పోలాల వైపు వెళ్తున్నారు. స్థానికులే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా వజ్రాల వేటకు వస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి వజ్రాలు దొరికాయి. తుగ్గలి మండలంలో మదనంతపురం, జొన్నగిరిలో విలువైన వజ్రాలు లభించగా.. తాజాగా పెండకల్ గ్రామంలో ఓ వ్యవసాయ కూలికి విలువైన వజ్రం లభించింది. తుగ్గలి […]
AP and Telangana High Courts: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే మరికొందరు కొత్త జడ్జీలు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలను నియమించాలని నిర్ణయించింది. ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జీల నియామకానికి కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు జడ్జీలుగా జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ గౌస్ […]