Home / Traffic Restrictions
Formula race: వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. హైదరాబాద్ వేదికగా జరిగే.. ఈ రేసింగ్ ఫార్ములా కోసం ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు. దీంతో వాహనదారులు గమనించి.. సూచించిన మార్గాల్లో వెళ్లాలని కోరారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు.
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. బేగంపేట పరిధిలోని రసూల్‌పురా-రాంగోపాల్‌పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
ఫార్ములా ఈ కార్ల రేసింగ్ కారణంగా హైదరాబాద్ లో ఐదు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కొన్ని రహదారులలో దారి మళ్లింపులు చేపట్టగా మరి కొన్ని రోడ్లపై రాకపోకలను పూర్తి నిలిపివేయనున్నారు ట్రాఫిక్ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ రోడ్డును శుక్రవారం నుంచి సోమవారం వరకు మూసివేయనున్నారు.
హైదరాబాద్‌లో నేడు రాహుల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా భాగ్యనగరంలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ ట్రాఫిక్ జోన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉండనున్నాయి.
బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఈ వేడుకల్లోని చివరి రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు సిటీ పోలీసులు వెల్లడించారు.
భాగ్యనగరంలో రేపు అనగా సెప్టెంబర్ 25 ఆదివారం నాడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలో గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ ఉన్న నేఫథ్యంలో ఈ ఆంక్షలు అమలుచేస్తున్నట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్ లో శుక్రవారం జరగబోయే గణేశ్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రోడ్ల పై రద్దీని తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు కోరారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, కేంద్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల పేరిట రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకొకటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది