Home / technology news
మారుతున్న కాలానుగుణంగా ఎప్పటికప్పుడు నూతన అప్డేట్ లతో యూజర్స్ కి మరింత మెరుగైన సేవలందించడానికి వాట్సాప్ సంస్థ కృషి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
మార్కెట్లో యాపిల్ పండ్లకు ఎంతటి డిమాండ్ ఉందో యాపిల్ ఫోన్లకు అంతే క్రేజ్ ఉంది. ఐఫోన్ ధర ఎంత ఉన్నా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. యాపిల్ నుంచి ఏదైనా కొత్త మొబైల్ వచ్చిందంటే చాలు ఇక యూజర్లకు పండగనే చెప్పాలి. ఇక ఈ ఫోన్ కేవలం రూ.21,450కే కొనుగోలు చేసుకోవచ్చండి. అదెలా చూసేద్దాం.
ఇప్పుడంటే లైట్ వెయిట్ ఫోన్లను అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నాం కానీ గత ముప్పై ఏళ్ల ముందు సంగతి ఆలోచించండి. అప్పుడు ఇంత సౌకర్యాలు ఎక్కడున్నాయి చెప్పండి. అయితే మనం ఇప్పుడు చేసే మెస్సేజ్ కు ప్రత్యామ్నాయంగా ఉండే ఎస్ఎంఎస్ సర్వీస్ వచ్చి నేటికి సరిగ్గా 30ఏళ్లు అంట. అప్పట్లో వొడాఫోన్ ఇంజినీర్ ఒకరు మొట్టమొదటి సారిగా ఎస్ఎంఎస్ చేశారట.
సర్వసాధారణంగా ఏటీఎం అంటే డబ్బులు వచ్చే మెషీన్ అని మనకు తెలిసిందే. కాగా పెరుగుతున్న అధునాతన సాంకేతికతో పలురకాల ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ టెక్నాలజీ మరింత అడ్వాన్స్డ్ అయ్యి ఇప్పుడు ఏకంగా బంగారాన్ని కూడా ఇచ్చే ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేశాయి. భారతదేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను శనివారం హైదరాబాద్ బేగంపేటలో ప్రారంభించారు.
మెదడులోని ఆలోచించనలతోనే పనులు చెయ్యగలిగితే ఎలా ఉంటుందంటారు. కలగా ఉండే ఈ ఆలచనలకు ప్రాణం పోస్తున్నారు స్పేస్ఎక్స్, న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్. కూర్చున్న చోటునుంచే ఎలాంటి కదలికలు లేకుండా మెదడు ద్వారానే ఆపరేట్ చేయగలిగే చిప్‌ను అభివృద్ధి చేసినట్టు ఆయన వెల్లడించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. తాజాగా ఈ వ్యాపార దిగ్గజం ఆరుగురు ప్రయాణించగల ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఇటీవల కాలంలో యాపిల్ మరియు ట్విట్టర్ కు మధ్య మాటల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మాట మార్చారు. టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ఆయన తాజాగా వెనక్కు తగ్గారు.
మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం అందుబాటులోకి రానుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వచ్చే మార్చిలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు మంగళవారం నిలిచిపోయాయి. జియో యూజర్లు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. దానితో ప్రస్తుతం ట్విట్టర్లో #Jiodown హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.
జియో ఫేస్బుక్- ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా సరికొత్త యాప్ తో వినియోదారులను ఆకర్షించేందుకు సన్నద్దమవుతుంది. "ప్లాట్‌ఫామ్" పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు జియో ప్రణాళికలు చేస్తుంది.