Aditi Rao Hydari Photos: ఎర్ర చీర, నుదుటిన సింధూరం.. కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ లుక్‌లో మెరిసిన అదితి రావు హైదరి

Aditi Rao Hydari Stunning in Red Saree at Cannes: హీరోయిన్ అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

తెలంగాణ హైదరాబాది అమ్మాయే అయినప్పటికీ తెలుగులో ఆమె నటించిన సినిమాలు చాలా తక్కువ

సమ్మోహానం, సముద్రం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అదితి

ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె గతేడాది హీరో సిద్ధార్థ్‌ని పెళ్లిచేసుకుని వైవాహిక జీవితంలోకి అడుపెట్టింది

అప్పటి నుంచి సోషల్ మీడియాతో అరుదుగా కనిపిస్తూ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది

లాంగ్ గ్యాప్ తర్వాత అతితి తన ఫోటోలు షేర్ చేసింది. ఎర్ర చీరలో నుదుటిన సిందూరం పెట్టుకున్ని సంప్రదాయ లుక్‌లో ఫిదా చేసింది

ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత 77వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అదితి సందడి చేసింది

ఈ సందర్భంగా రుపు రంగు డిజైనర్ చీరలో కనిపించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఈ చీరకు తగ్గట్టుగా ఆమె నుదుట సింధూరం ధరించి భారతీయ వధువులా ముస్తాబైంది

స్లీవ్‌లెస్ బ్లౌజ్, సింపుల్ జువెల్లరీతో ఆమె లుక్ మరింత ప్రత్యేకంగా నిలిచింది. అదితి ఎంపిక చేసుకున్న ఈ చీర ఆమెకు చక్కగా సెట్ అయ్యింది.

ఇక అదితి లుక్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. ఎరుపు రంగు చీర, నుదుట సింధూరంతో అదితి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుందని ప్రశంసిస్తున్నారు.

ఆమె ఈ లుక్‌లో భారతీయ సంస్కృతిని కేన్స్ వేదికపై గొప్పగా చాటి చెప్పిందంటూ ఫ్యాన్స్ ఆమెను కొనియాడుతున్నారు.

కేన్స్ రెడ్ కార్పెట్‌పై అదితి ప్రదర్శించిన ఈ సంప్రదాయ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది