Home / NEET 2022
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) ఫలితాలు విడుదలయ్యాయి. రాజస్థాన్ అమ్మాయి తనిష్క మొదటి ర్యాంక్ ను కైవసం చేసుకుంది. తర్వాత వత్స ఆశిష్ బాత్రా మరియు హృషికేష్ నాగభూషణ్ గంగూలే తరువాత స్దానాల్లో నిలిచారు.
కేరళ కొల్లాం జిల్లాలో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి హాజరయ్యే ముందు తమ ఇన్నర్వేర్లను తొలగించమని బాలికలను కోరిన సంఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి చెందిన ముగ్గురు, కాలేజీకి చెందిన ఇద్దరు ఉన్నారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2022 జూలై 17న జరుగుతుంది, నిరసనలు ఉన్నప్పటికీ, అధికారులు పరీక్ష తేదీలను మార్చలేదు. మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం నమోదు చేసుకున్న 18 లక్షల మంది విద్యార్థులు ఒకే సమయంలో పెన్ మరియు పేపర్ విధానంలో పరీక్ష రాయనున్నారు. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద పరీక్ష.