Home / Latest Internatioinal News
సోమాలియాలోని బెలెడ్‌వేన్ నగరంలోని భద్రతా తనిఖీ కేంద్రం వద్ద జరిగిన బాంబు దాడిలో కనీసం 18 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. చెక్‌పాయింట్ వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం పేలడంతో దాదాపు 40 మంది గాయపడ్డారు. ఇది ఆత్మహుతి దాడిగా భావిస్తున్నారు.
భారతీయ-అమెరికన్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి H-1B వీసా ప్రోగ్రామ్‌ను ఒప్పంద సేవగా పేర్కొన్నారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గగెలిస్తే లాటరీ ఆధారిత వ్యవస్థను రద్దు చేస్తానని దాని స్దానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని తీసుకు వస్తానని తెలిపారు.
బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన వ్యక్తిలో పంది కిడ్నీ సాధారణంగా రెండు నెలలపాటు పనిచేసి రికార్డు సృష్టించింది.NYU లాంగోన్ హెల్త్‌లో ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అయిన డాక్టర్ రాబర్ట్ మోంట్‌గోమెరీ నేతృత్వంలోని ఈ ప్రయోగం బుధవారం ముగిసింది,
అమెరికాలో ఒక తెలుగు విద్యార్ది ప్రమాదంలో మరణిస్తే ఆమె ప్రాణాలకు విలువలేదంటూ హేళనగా మాట్లాడిన పోలీసు అధికారిపై భారతీయులు భగ్గుమంటున్నారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు వణికిపోయాయి.మనదేశంలో స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో 1,000 పాయింట్ల వరకు నష్టపోయి.. మార్కెట్ ముగిసే సమయానికి కాస్తా కోలుకుని 700 పాయింట్ల నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపద 3.65 లక్షల కోట్లు హారతి కర్పూరం అయ్యింది. గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలడానికి ప్రధాన కారణం రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను AAA నుంచి AA+కు కుదించడం.
నల్ల సముద్రంలో తన నౌకాశ్రయాల ద్వారా ఉక్రెయిన్ ధాన్యాన్ని సురక్షితంగా రవాణా చేయడానికి అనుమతించే అంతర్జాతీయ ఒప్పందాన్ని పొడిగించడానికి రష్యా నిరాకరించింది.రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ, ఇక నుండి నల్ల సముద్రంలోని ఉక్రేనియన్ నౌకాశ్రయాలకు ప్రయాణించే అన్ని నౌకలు మిలిటరీ కార్గో యొక్క వాహకాలుగా పరిగణించబడతాయని పేర్కొంది.
నైరుతి చైనాలోని పర్వత ప్రాంతాల్లో వరదల కారణంగా కనీసం 15 మంది మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం, 31 మిలియన్ల విస్తారమైన పర్వత ప్రాంతమైన చాంగ్కింగ్లో మధ్యాహ్నానికి మరో నలుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు తెలిసింది.
: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌పై నమోదైన తోషాఖానా కేసును ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) మంగళవారం "అమోదయోగ్యం కాదు" అని ప్రకటించింది. ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ ఫరూక్ తీర్పు ఇమ్రాన్ ఖాన్‌కు ఊరటనిచ్చింది.
సింగపూర్‌లో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఆత్మహత్యలు 22 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. క్రితం ఏడాదితో పోల్చుకుంటే ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. నగరంలోని ప్రజలు ఏదో తెలియని మానసిక వ్యాధితో బాధపడుతున్నారని స్థానిక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
భారత ప్రధాని మోదీ చారిత్రాత్మకమైన యునైటెడ్ స్టేట్స్ పర్యటన నేపధ్యంలో హెచ్-1బీ వీసాలు ఉన్న భారతీయులకు దేశంలో నివసించడం మరియు పని చేయడం సులభతరం చేయాలని బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు రాయిటర్స్ తెలిపింది.