Home / Ganesh Immersion
గణేష్ నిమజ్జనం వేడుకలను అత్యంత వైభవంగా చేపట్టే ప్రాంతాల్లో ఢీల్లీ తర్వాత హైదరాబాదుకు ప్రత్యేక స్థానం ఉంది. లక్షలాది వినాయక విగ్రహ ప్రతిమలను ఊరేగింపు అనంతరం ఆయా ప్రాంతాల్లో కేటాయించిన ప్రదేశాల్లో గణనాధుడిని నిమజ్జనం చేస్తుంటారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాశలతో నిమజ్జన వేడుకలను విజయవంతం చేసేందుకు కీలక వ్యవస్ధలను ఉపయోగించుకొనింది.
ఏ వేడుకలైనా ఎవరికీ హానీ కలుగనంతవరుకే ఆనందంగా ఉంటాయి. కానీ సృతిమించితే అనేక అనర్ధాలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో ఒకటి చోటుచేసుకుంది. గణనాథుని వేడుకలలో దాదాపు 65 మంది చూపు పోగొట్టుకున్నారు.
హైదరబాదు మెట్రో రైలు సరికొత్త రికార్డు నెలకొల్పింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా 4లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించిన్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.
గణనాథునికి 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం ఎంతో సందడిగా గణేషునికి వీడ్కోలు పలుకుతుంటాము. కాగా హర్యానాలో నిర్వహించిన బొజ్జగణపయ్య నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఏడుగురు వ్యక్తులు నీటమునిగి చనిపోయారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
హైదరాబాద్ లో శుక్రవారం జరగబోయే గణేశ్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రోడ్ల పై రద్దీని తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు కోరారు.
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పై వివాదం తొలగిపోయింది. రేపటి నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ పై జిహెచ్ఎంసి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాల కోసం ఏకంగా 15 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గంలో 9, పీవీ మార్గ్ లో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం పై రగడ మొదలయింది. దీనిపై అధికార విపక్షాల నడుమ మాటల యుద్దం నడుస్తోంది. ప్రభుత్వం కావాలనే హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామంటోంది.