Home / defamation case
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్ , రిపబ్లికన్‌పార్టీ అభ్యర్ది డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది.ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసు లో న్యూయార్క్‌లోని మాన్హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమెకు 83 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అని వ్యాఖ్యలు చేసి పరువు నష్టం కేసులో రెండేళ్ళ జైలు శిక్షకి గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట దొరికింది. సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ళ జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విధించిన రెండేళ్ల జైలు శిక్ష కేసులో సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 4వ తేదీకి వాయిదా పడింది. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.దీనిపై విచారించిన సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేసినా రాహుల్‌కు ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకిఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ హైకోర్టు శుక్రవారం తన 2019 మోడీ ఇంటిపేరు వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో అతని పిటిషన్‌పై శిక్షపై స్టేను తిరస్కరించి సెషన్స్ కోర్టు ఉత్తర్వును సమర్థించింది. సెషన్స్ కోర్టు ఆదేశం న్యాయమైనది, సరైనది మరియు చట్టబద్ధమైనది అని పేర్కొంది.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు ఇవాళ సమన్లు జారీ చేసింది. 100 కోట్ల పరువు నష్టం కేసులో జులై 10 న న్యాయస్థానం ముందు హాజరు కావాలని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది.
2019 నాటి ‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులోకాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ సెలవుల తర్వాత తీర్పును వెలువరించనున్నారు. అయితే అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది.
రువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సూరత్ సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, కిందికోర్టు తనకు విధించిన జైలు శిక్ష తీర్పుపై అప్పుడే తీర్పు చెప్పలేమని వెల్లడించింది.
గుజరాత్‌లోని సూరత్ కోర్టు, గురువారం నాడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించింది, అతని "మోదీ ఇంటిపేరు" వ్యాఖ్యలపై అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తన పేరును అన్యాయంగా లాగడం ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన పరువు తీశారంటూ నటి నోరా ఫతేహి దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు మార్చి 25న విచారించే అవకాశం ఉంది.