Home / Operation Akarsh
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో కీలక మలుపు చోటుచేసుకొనింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై భాజపా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మొయినాబాద్ ఫాం హౌస్ కేంద్రంగా సాగిన తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ ఘటనలో సీఎం కేసిఆర్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ తో ఎమ్మెల్యేల కొనుగోలు స్కాంను బయటపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
మెయినాబాద్ ఫామ్ హౌస్ లో పోలీసులకు రెడ్ హ్యాండడ్ గా పట్టుబడిన తెరాస శాసనసభ్యుల ఆకర్ష్ ఘటన పై న్యాయస్ధానాన్ని ఆశ్రయించనున్నట్లు భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.
తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర కలకలకం రేపుతోంది. ఇకపోతే ఈ వ్యవహారం మరియు భాజపాపై వస్తున్న ఆరోపణలను భాజపా నేత బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అధికార టీఆర్ఎస్పై స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ కు పోలీసులు చెక్ పెట్టారు. 400కోట్లతో నలుగురు అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ను కొనుగోలు చేసేందుకు వేసిన పెద్ద ప్లాన్ ను పోలీసులు బెడిసికొట్టేలా చేశారు.