Home / Bajrang Punia
భారతీయ రెజ్లింగ్‌లో కొనసాగుతున్న సంక్షోభం తాజా మలుపు తిరిగింది.తమ కెరీర్లో ఒక కీలకమైన సంవత్సరాన్ని కోల్పోయినందుకు నిరసనగా వందలాది మంది జూనియర్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమావేశమయ్యారు. ఈ పరిస్థితికి వారు అగ్రశ్రేణి గ్రాప్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్ లను నిందించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నికకు నిరసనగా ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై బజరంగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన సుదీర్ఘ లేఖను X లో షేర్ చేసారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరగకపోవడమే కారణమని ఈ లేఖలో పునియా పేర్కొన్నారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన భారత స్టార్ రెజ్లర్లు శనివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయితేనే ఈ ఏడాది జరగబోయే ఏషియన్ గేమ్స్ లో పాల్గొంటామని..
జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నిరసనకు దిగిన రెజ్లర్లు ఈ సాయంత్రం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ నుండి ఇండియా గేట్ వరకు క్యాండిల్‌లైట్ మార్చ్‌కు పిలుపునిచ్చారు.
బుధవారం రాత్రి ఢిల్లీ పోలీసు సిబ్బందితో గొడవ తర్వాత, నిరసనకు దిగిన రెజ్లర్లు వినేష్ ఫోగట్ మరియు బజరంగ్ పునియా గురువారం తమ పతకాలు మరియు అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఇలా అవమానాలకు గురవుతుంటే ఈ సన్మానాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వారు అన్నారు.
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా మరో ఘనత సాధించాడు. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో 4 పతకాలు గెలిచిన తొలి రెజ్లెర్ గా బజరంగ్ చరిత్రకెక్కాడు.