Home / Heavy Rainfall
జమ్మూ కశ్మీర్ లోని రియాసి జిల్లా కత్రా లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. వరదల కారణంగా మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో మాతా వైష్ణోదేవి తీర్థయాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తం అయ్యారు.
తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో 15 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోనే ఉన్నాయి. తిరుచ్చి, నామక్కల్, సేలం జిల్లాల్లో వరదలు ప్రమాదకరస్థాయిని తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
కేరళలో వరుసగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని దక్షిణ జిల్లాలో వర్షాలు కాస్తా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వాతావరణశాఖ ఈ రోజు ఎనిమిది జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఇదుక్కి, త్రిసూర్, పలక్కాడ్, మల్లాపురం, కోజికోడ్, వానియాడ్,