Home / charge sheet
అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర్ అనే వ్యక్తులపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారితోపాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఛార్జిషీట్ వేసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో గతనెల 30న ఛార్జిషీటు సమర్పించిన సీబీఐ వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కీలకంగా ప్రస్తావించింది. షర్మిల వాంగ్మూలాన్ని చార్జిషీటులో పొందు పరిచింది. గతేడాది అక్టోబర్ 7న షర్మిల ఢిల్లీలో 29వ సాక్షిగా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం ఎంతటి సంచలం సృష్టించిందో తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. తాజాగా సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును రెండవ అనుబంధ చార్జీషీటులో నమోదు చేసింది.