Published On:

Sarangapani Jathakam OTT: సర్‌ప్రైజ్‌.. ఓటీటీ వచ్చేస్తోన్న సారంగపాణి జాతకం.. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌

Sarangapani Jathakam OTT: సర్‌ప్రైజ్‌.. ఓటీటీ వచ్చేస్తోన్న సారంగపాణి జాతకం.. అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌

‘Sarangapani Jathakam’ Movie OTT Release and Streaming Date: కమెడియన్‌ ప్రియదర్శి లీడ్‌ రోల్లో, వెన్నెల కిషోర్‌, వైవా హర్ష ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మల్లేశం, బలగం, కోర్ట్‌ వంటి హిట్‌ చిత్రాల తర్వాత ప్రియదర్శి నటించిన చిత్రమిది. పైగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. కామెడీ ఎంటర్‌టైనర్‌గా థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులు బాగా నవ్వించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ అందుకుంది.

 

దీంతో బాక్సాఫీసు వద్ద ఈ మూవీ మంచి విజయం సాధించింది. థియేటర్లలో కడుబ్బానవ్వించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్‌ వేదికగా అలరించేందుకు సిద్దమవుతుంది. ఓటీటీలో నేటి రాత్రి నుంచి సారంగపాణి జాతకం అందుబాటులోకి రానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేదు కానీ, ఓటీటీ ప్రియులకు సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఈ అర్థరాత్రి నుంచి మూవీ స్ట్రీమింగ్‌ ఇవ్వనుందట. కాగా ప్రతి శుక్రవారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు విడుదల అవుతాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు శుక్రవారం సందర్భంగా గురువారం మిడ్‌నైట్‌ నుంచి పలు చిత్రాలను అందుబాటులోకి తెస్తున్నాయి పలు ఓటీటీ సంస్థలు. అందులో ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌ల సారంగపాణి జాతకం కూడా ఉందని టాక్‌.

 

కాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అమెజాన్‌ ప్రైం సొంతం చేసుకుంది. దీంతో మే 23న ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేయబోతోంది సదరు సంస్థ. దీనిపై ఇప్పటి వరకు అమెజాన్‌ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. కానీ, రేపు మూవీని స్ట్రీమింగ్‌ ఇచ్చేసి మూవీ లవర్స్‌కి సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుందట. ఇక థియేటర్లలో విడుదలైన నెల రోజుల ముందే ఈ చిత్రం ఓటీటీలోకి రావడం విశేషం. కాగా ఇందులో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ చాలా ఉన్నాయి. వాటిని తీసేసి మంచి కామెడీ చిత్రంగా అమెజాన్‌ ప్రైం ఓటీటీ ప్రియులకు అందించనుందట. కాగా ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన రూపా కొడువాయూర్‌ హీరోయిన్‌గా నటించగా.. శివలెంక ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.