రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది.
గర్భగుడి ముందుండే మండపంలో అద్భుత శిల్పకళ ఉంటుంది. పురాణ గాథలు, నాట్యగత్తెలు, సంగీత వాయిద్యకారులు, పౌరాణిక జంతువులు.. ఇలాంటివి ఆ శిల్పాలపై చెక్కారు.
కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు ఈ గుడి కట్టించినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఈ గుడి శిల్పి పేరు రామప్ప. శిల్పి పేరుతో ఖ్యాతి గడించిన గుడి లేదా నిర్మాణం అరుదు.
నేల నుంచి ఆరు అడుగులు ఎత్తున్న నక్షత్రాకార మండపంపై ఈ గుడి నిర్మించారు. పునాది లేకుండా నేరుగా ఇసుకపై ఈ గుడి నిర్మించారు. ఎర్ర ఇసుకతో నిర్మించిన రాయి రంగు ఇప్పటికీ కోల్పోలేదు.
ఈ గుడికి సంబంధించిన శాసనం పాడవకుండా, ప్రత్యేకంగా ఆ శాసనం కోసమే ఒక మండపం కట్టించారు.
ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలోని నంది శిల్పం కూడా మిగతా చోట్ల కంటే భిన్నంగా ఉంటుంది.