Last Updated:

IPL 2024: ఐపీఎల్ 2024… మే 18న బెంగళూరులో తలపడుతున్న ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు

మే 18 కోసం యావత్‌ క్రికెట్‌ లోకం ఎదురుచూస్తోంది. ఆ రోజు బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇది నాకౌట్‌ మ్యాచ్‌లా మారిపోయింది. ఇరు జట్లకు కీలకం ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అందుకే ఇరు జట్ల అభిమానులు రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు

IPL 2024: ఐపీఎల్ 2024… మే 18న బెంగళూరులో తలపడుతున్న ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు

IPL 2024: మే 18 కోసం యావత్‌ క్రికెట్‌ లోకం ఎదురుచూస్తోంది. ఆ రోజు బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇది నాకౌట్‌ మ్యాచ్‌లా మారిపోయింది. ఇరు జట్లకు కీలకం ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అందుకే ఇరు జట్ల అభిమానులు రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు. కాగా చెన్నైతో మ్యాచ్ లో విజయం ఆర్సీబీ జట్టుదేనంటున్నారు అభిమానులు. మే 18న మ్యాచ్ జరగడమే ఇందుకు కారణం. మే 18కి విరాట్‌కు చాలా అనుబంధం ఉంది. ఆ తేదీన విరాట్ ఆడిన ప్రతిమ్యాచ్ గెలిచారు. ఇక అన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 నే. కాబట్టి కింగ్ దగ్గరుండి ఆర్సీబీని గెలిపిస్తాడని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. మొత్తానికి చెన్నైతో మ్యాచ్ లో ఆర్సీబీ విజయం, ప్లే ఆఫ్ అవకాశాలన్నీ 18 నెంబర్‌తోనే ముడిపడిఉన్నాయి.

18 నెంబర్ తో ముడిపడి ఉందా? (IPL 2024)

మే 18న ఇప్పటి వరకు ఆర్సీబీ 4 మ్యాచ్‌లు ఆడింది. 2013 లో మే 18న జరిగిన మ్యాచ్ లో సీఎస్‌కే పై ఆర్సీబీ గెలిచింది. 2014లో ఇదే తేదీన సీఎస్‌కే ని కూడా చిత్తు చేసింది. ఇక 2016లో మే 18 పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందింది. గతేడాది ఇదే తేదీన ఎస్ఆర్ హెచ్ ను ఓడించింది ఆర్సీబీ. ఇప్పుడు కూడా మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. కాబట్టి ఈసారి కూడా విజయం ఆర్సీబీ జట్టుదేనన్న వాదనను అభిమానులు ముందుకు తెస్తున్నారు. ఇక మే 18న జరిగిన మ్యాచుల్లో విరాట్ కోహ్లీ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. మే 18న కింగ్ కోహ్లీ ఐపీఎల్‌లో 4 మ్యాచ్‌లు ఆడాడు. సీఎస్‌కే పై 29 బంతుల్లో 56 నాటౌట్, పంజాబ్ కింగ్స్‌పై 113 (50) పరుగులు చేశాడు. అలాగే, గత సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ పై 63 బంతుల్లో 100 రన్స్ కొట్టాడు. కాబట్టి మే 18న కింగ్ కోహ్లి మరోసారి రెచ్చిపోవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కనీసం 18 పరుగుల తేడాతో గెలిస్తే, సీఎస్‌కే నెట్ రన్ రేట్‌ను అధిగమించవచ్చు. ఆర్సీబీ ఛేజింగ్ చేస్తే 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా పాయింట్ల పట్టికలో సీఎస్‌కే ని అధిగమించవచ్చు. యాదృచ్ఛికంగా ఇక్కడ 18 కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను ప్రభావితం చేయనుంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 18వ తేదీన జరిగే మ్యాచ్‌లో ఒకవేళ ఆర్సీబీ ముందు బ్యాటింగ్‌ చేస్తే.. సీఎస్‌కును 18 అంతకంటే ఎక్కువ రన్స్‌ తేడాతో ఓడించాలి. ఒక వేళ ఛేజింగ్‌ చేయాల్సి వస్తే.. 18.1 ఓవర్లలో లోపలే టార్గెట్‌ను చేరుకోవాలి. అప్పుడే సీఎస్‌కే కంటే మెరుగైన రన్‌ రేట్‌ను సాధించి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇలా 18 చుట్టూనే ఆర్సీబీ జాతకం తిరుగుతోంది. ఇలా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆర్సీబీని ఆ 18 నంబరే కాపాడి, ప్లే ఆఫ్స్‌కు చేర్చాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.