Last Updated:

Aadikeshava Movie Review : వైష్ణవ్ తేజ్, శ్రీలీల “ఆదికేశవ” మూవీ రివ్యూ, రేటింగ్ ?

Aadikeshava Movie Review : వైష్ణవ్ తేజ్, శ్రీలీల “ఆదికేశవ” మూవీ రివ్యూ, రేటింగ్ ?

Cast & Crew

  • పంజా వైష్ణవ్ తేజ్ (Hero)
  • శ్రీ లీల (Heroine)
  • జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు (Cast)
  • శ్రీకాంత్ ఎన్. రెడ్డి (Director)
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ (Producer)
  • జీవీ ప్రకాష్ కుమార్ (Music)
  • డడ్లీ (Cinematography)
2.5

Aadikeshava Movie Review : ‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు పంజా వైష్ణవ్ తేజ్. కానీ ఆ తర్వాత వైష్ణవ్ నటించిన రెండు సినిమాలు ఆడియన్స్ ని నిరాశ పరిచాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు యంగ్ బ్యూటీ శ్రీ లీలతో కలిసి నటించిన చిత్రం “ఆదికేశవ”. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ విలన్ గా  నటించారు. తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ మ్యూజిక్ అందించగా.. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని సంయుక్త నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. పలు కారణాల రీత్యా ఆలస్యం అవుతూ వస్తుంది. అలానే వైష్ణవ్ మొదటి సారి మాస్ మూవీ చేయడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించందా ? లేదా అనేది తెలుసుకుందాం..

మూవీ కథ.. 

బాలు(వైష్ణవ్) చదువు అయిపోయి ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో అమ్మ జాబ్ తెచ్చుకోమని చెప్పడంతో చిత్ర(శ్రీలీల) సీఈవోగా ఉన్న కంపెనీలో జాబ్ తెచ్చుకుంటాడు. బాలు, చిత్ర ప్రేమించుకుంటున్నారని తెలిసి వాళ్ళ నాన్న ఇంకొకరితో అందరిముందు చిత్రకు పెళ్లి అనౌన్స్ చేస్తాడు. చిత్ర వాళ్ళ నాన్న బాలుని కొట్టిద్దాం అనుకున్న సమయంలో బాలు వాళ్ళ అమ్మ వచ్చి మేము నీ అసలు అమ్మ నాన్న కాదు, నీ సొంత నాన్న మహాకాళేశ్వర్ రెడ్డి(సుమన్) చనిపోయాడు అని అతని తరుపు వాళ్ళతో రాయలసీమకు పంపుతుంది. మహాకాళేశ్వర రెడ్డి ఎవరు? అతను ఎలా చనిపోయాడు? బాలు, చిత్రల ప్రేమ ఏమైంది? బాలు రాయలసీమకు వెళ్ళాక రుద్రా కాళేశ్వరరెడ్డిగా ఎలా మారాడు? మధ్యలో చెంగారెడ్డి మైనింగ్ కథేంటి? సీమలోని చిన్న పిల్లలతో మైనింగ్ చేయించే చెంగారెడ్డి (జోజు జార్జ్)కి, బాలుకు మధ్య ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

సినిమా విశ్లేషణ (Aadikeshava Movie Review).. 

‘ఆదికేశవ’ ట్రైలర్ చూస్తే… ఇదొక మాస్ అండ్ కమర్షియల్ టెంప్లేట్ మూవీ అని అర్ధం అవుతుంది. కమర్షియల్ సినిమా తీయాలని అనుకుని ఎక్కడా దారి తప్పకుండా ఫుల్ మాస్ మూవీని తీశారు. అయితే ఇప్పటికే తెలుగులో ఇలాంటివి ఎన్నో సినిమాలు వచ్చాయి. మాస్ టెంప్లేట్ రొటీన్ సినిమాగా ఈ మూవీ నిలిచింది. ప్రథమార్థంలో కొంచెం లవ్ స్టోరీ, కామెడీ, సాంగ్స్ తో అలా సాగిపోయింది. వైష్ణవ్ & సుదర్శన్ మధ్య సీన్లు, డైలాగ్స్ & కామెడీ టైమింగ్ భలే కుదిరింది. కొన్ని సీన్లు నవ్విస్తాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత కథ సీమకు షిఫ్ట్ కావడంతో సినిమా మరీ రొటీన్ అయిపోయింది. కథ, ట్విస్టులు పాపులర్ సినిమాలను గుర్తు చేస్తాయి. దాంతో కాస్త బోరింగ్ మూమెంట్స్ వచ్చి చేరాయి. యాక్షన్ సన్నివేశాలు బోయపాటి సినిమాలను గుర్తు చేశాయి. కమర్షియల్ సినిమా ఇలాగే ఉంటుంది.ఉండాలి అన్నట్లు కొన్ని లెక్కలువేసుకుని మూవీ తీసేసినట్లు అనిపిస్తుంది. మనుషులని ఇన్ని రకాలుగా చంపొచ్చా అనే సందేహం వస్తుంది ఆ మాస్ ఫైట్స్ చూసి. సినిమా అంతా అయ్యాక చివర్లో ఇచ్చే ఓ ట్విస్ట్ ఆసక్తిగా ఉంటుంది. కథనం అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లాడు. కాకపోతే లాజిక్ లెస్ సీన్స్ చాలా ఉంటాయి. అంచనాలు లేకుండా వెళ్ళే వారికి నచ్చే అవకాశం ఉంది.

ఎవరెలా చేశారంటే.. 

వైష్ణవ్ తేజ్ మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మంచి ప్రయత్నమే చేశాడు. కథకు అవసరమైన మాస్ సన్నివేశాల్లో హీరోయిజం చూపించారు. కమర్షియల్ సినిమాల్లో కథానాయికగా మరోసారి శ్రీ లీల కనిపించారు. డ్యాన్సులు బాగా చేశారు. క్యూట్ అండ్ లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. వైష్ణవ్, శ్రీ లీల జోడీ బావుంది. జోజు జార్జ్ రొటీన్ క్యారెక్టర్ అయినా.. అందులో ఆయన రూపం కొత్తగా ఉంటుంది. జోజు జార్జ్ భార్యగా సదా, సుమన్, తనికెళ్ళ భరణి, రాధిక, జయప్రకాశ్ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ పాటలు, నేపథ్య సంగీతంలో కమర్షియాలిటీ వినిపించింది. కెమెరా వర్క్ బాగుంది. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదని అర్థం అవుతోంది.

కంక్లూజన్.. 

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

ఇవి కూడా చదవండి: