Last Updated:

Jigarthanda DoubleX Movie Review : లారెన్స్, ఎస్‌జే సూర్య “జిగర్తాండా డబుల్ఎక్స్” మూవీ రివ్యూ..?

Jigarthanda DoubleX Movie Review : లారెన్స్, ఎస్‌జే సూర్య “జిగర్తాండా డబుల్ఎక్స్” మూవీ రివ్యూ..?

Cast & Crew

  • రాఘవ లారెన్స్ (Hero)
  • నిమిషా సజయన్ (Heroine)
  • ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో తదితరులు (Cast)
  • కార్తీక్ సుబ్బరాజు (Director)
  • కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్, అలంకార్ పాండియన్ (Producer)
  • సంతోష్ నారాయణన్ (Music)
  • తిరు (Cinematography)
2.5

Jigarthanda DoubleX Movie Review : రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ మాస్టర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా సుపరిచితుడే. రీసెంట్ గానే చంద్రముఖ 2 తో వచ్చిన లారెన్స్ ఆడియన్స్ ని ఆశించినంత స్థాయిలో అలరించలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘పిజ్జా’, ‘పేట’, ‘జిగర్తాండా’ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించి ఈసారి మెప్పించేందుకు వచ్చేస్తున్నాడు. రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రల్లో వచ్చిన చిత్రం ‘జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’. దీపావళి కానుకగా ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి లారెన్స్ ఈసారి అయిన మెప్పించాడో, లేదో మూవీ రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

మూవీ కథ..

ఎస్సై కావాలనుకుని తన భయం కారణంగా హత్య నేరంలో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు కృప (ఎస్‌జే సూర్య). రాజకీయ నాయకుల అండతో కర్నూలు మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న అలియస్ సీజర్ (రాఘవ లారెన్స్). రాజకీయాల్లో ఉన్న సినిమా హీరో జయకృష్ణ (షైన్ టామ్ చాకో). తను నటించిన సినిమాకు కాకుండా పోటీగా విడుదల అయిన సినిమాకు ఎక్కువ థియేటర్లు దక్కేలా చేసినందుకు తన పార్టీలోనే ఉన్న మరో నాయకుడిపై జయకృష్ణ కక్ష కడతాడు. అతనికి అండగా ఉన్న నలుగురు రౌడీలను చంపాలని డీఎస్పీగా పని చేస్తున్న తమ్ముడిని (నవీన్ చంద్ర) రంగంలోకి దించుతాడు. ఎస్సై పోస్టింగ్ అందుకుని వివిధ కారణాల వల్ల జైలు శిక్ష అనుభవిస్తున్న నలుగురిని సెలక్ట్ చేస్తాడు హీరో తమ్ముడు. ఒక్కొక్కరు ఒక్కో రౌడీని చంపాలని టార్గెట్ పెడతాడు. అందులో కృపకు అలియాస్ సీజర్ పేరు వస్తుంది. దీంతో రే దాసన్ అనే దర్శకుడి పేరుతో సీజర్ పంచన చేరతాడు కృప. తన రంగును ఒక హీరో అవమానించడంతో ఎలాగైనా హీరో అవ్వాలని మంచి దర్శకుడి కోసం సీజర్ వెతుకుతూ ఉంటాడు.  వారిలో కృప ఒకడు. సీజన్ ని చంపేందుకు కృప సిద్ధం అవుతాడు. సినిమా హీరో కావాలని కలలు కంటున్న సీజర్ వద్దకు సినిమా డైరెక్టర్ అంటూ వస్తాడు.. మరి కృప సీజర్ ని చంపాడా? కృప, సీజన్ ప్రయాణం ఎలా సాగింది? సీజర్ హీరో అయ్యాడా? జయకృష్ణ పగ తీరిందా ?? సినిమా చివరికి విడుదల అయిందా ??? అనేది మిగతా కథ..

సినిమా విశ్లేషణ (Jigarthanda DoubleX Movie Review)..

ఈ సినిమా విషయానికి వస్తే టీజర్, ట్రైలర్ లలో మంచి రా & రస్టిక్ గా చూపించి మంచి అంచనాలు క్రియేట్ చేయగలిగారు. జిగర్తాండాలో రౌడీతో సినిమా చేయాలని వచ్చిన హీరో అనే యాంగిల్ లో చూపిస్తే .. ఇందులో ఒక గ్యాంగ్ స్టర్ తనను హీరోగా చూడాలనుకొని దాయీకటర్ తో సినిమా తీయించుకోవడం చూపించారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నుండి రీసెంట్ టైమ్స్ లో జిగర్ తండ రేంజ్ మూవీ మరలా రాలేదు అని చెప్పాలి. జిగర్ తండ డబుల్ ఎక్స్ తో ఆ లోటు తీరుస్తాడు అనుకుంటే నిరాశపరిచాడు. కానీ తాను చెప్పాల్సిన కథను చెప్పడంలో కొంత మేర సక్సెస్ అయ్యాడు. పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు.

Jigarthanda Double X Release: FDFS Timing, Ott Expected Date, Platform,  Preview, Cast & Pre-release Business – FilmiBeat

సినిమా ఫస్టాఫ్ లో ..  రాఘవ లారెన్స్ ఇంట్రడక్షన్ ఫైట్‌ను చాలా భారీగా తెరకెక్కించారు. తన క్యారెక్టర్‌కు భారీ బిల్డప్ ఇచ్చారు. అన్ని పాత్రల పరిచయం, వాటన్నిటినీ ఒక్క చోటికి ఇదంతా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య మొదటి సారి కలిసే సన్నివేశంలో ఎస్‌జే సూర్య నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు ప్రధాన హైలెట్ ఇంటర్వెల్. ఆ సీన్ పిక్చరైజేషన్‌తో పాటు అక్కడ వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ వరకు సినిమా చాలా బాగుంది. ఎంగేజింగ్‌గా సాగుతూ ఆకట్టుకుంటుంది. ఇక అసలు సమస్య సెకండాఫ్ నుంచి మొదలవుతుంది. ఇక్కడ కూడా సీజర్ అడవికి వెళ్లడం, అక్కడ ఉండే విలన్‌తో తలపడటం ఇంతవరకు బాగానే ఉంటుంది. ఎక్కడైతే స్టోరీ అడవిలో ఉండే జనం, వారి సమస్యల వైపు మళ్లుతుందో గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతుంది. సినిమా అనే బలమైన మాధ్యమం ద్వారా ఒక సమస్యను చెప్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్న సంగతి నిజమే. కానీ సినిమా ప్రధాన లక్ష్యం ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం. ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తూ సమస్యను ఎంత బలంగా చెప్పినా పర్లేదు. కానీ డాక్యుమెంటరీలా చూపిస్తే కనెక్ట్ అవ్వడం కష్టం. అదే ఇక్కడ దెబ్బ కొట్టింది. క్లైమ్యాక్స్‌లో కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ అప్పటికి ప్రేక్షకులు నిరాశలో ఉంటారు.

ఎవరెలా చేశారంటే.. 

ఇక రాఘవ లారెన్స్ ఇప్పటివరకు చేసిన పెర్పార్మెన్స్‌ల్లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించారు. ఎస్‌‌జే సూర్య ఎప్పటిలానే మంచి పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. కానీ తన మార్కు కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం కష్టం. లారెన్స్ భార్య పాత్రలో నటించిన నిమిషా సజయన్ సినిమాలో సర్‌ప్రైజ్ ప్యాకేజ్ లాగా చాలా బాగా నటించారు. షైన్ టామ్ చాకో, నవీన్ చంద్ర నెగిటివ్ పాత్రల్లో బాగా నటించారు. సినిమా ప్రధాన ప్లస్ పాయింట్ సంతోష్ నారాయణన్ సంగీతం. ఒక నేటివ్ సినిమాకు వెస్టర్న్ మ్యూజిక్‌తో డిఫరెంట్ మూడ్ ఇచ్చాడు. ఇంగ్లీష్ ట్రాక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. తిరు సినిమాటోగ్రఫీ కూడా సూపర్. సెట్ వర్క్‌కు ఈ సినిమాకు మరో స్తంభం లాంటిది. 1975 మూడ్‌ను పర్ఫెక్ట్‌గా స్క్రీన్‌పై చూపెట్టారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి

కంక్లూజన్.. 

కొంచెం తక్కువైంది..

ఇవి కూడా చదవండి: