Last Updated:

Pushpa-2 Poster: ఉగ్రరూపదారి అయిన అమ్మవారి అవతారంలో అల్లు అర్జున్.. నెట్టింట హల్చల్ చేస్తున్న పుష్ప-2 కొత్త పోస్టర్

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప మానియా ఆవరించింది. పుష్ప-2 టీజర్ విడుదలతో నెట్టింట పుష్పరాజ్ పేరు హోరెత్తుతుంది. ఎటు చూసిన పుష్ప పుష్ప.. వేర్ ఈజ్ పుష్ప నేమ్‌ అండ్ సీన్స్‌ నెట్టింట వీరంగం సృష్టిస్తున్నాయి.

Pushpa-2 Poster: ఉగ్రరూపదారి అయిన అమ్మవారి అవతారంలో అల్లు అర్జున్.. నెట్టింట హల్చల్ చేస్తున్న పుష్ప-2 కొత్త పోస్టర్

Pushpa-2 Poster: ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప మానియా ఆవరించింది. పుష్ప-2 టీజర్ విడుదలతో నెట్టింట పుష్పరాజ్ పేరు హోరెత్తుతుంది. ఎటు చూసిన పుష్ప పుష్ప.. వేర్ ఈజ్ పుష్ప నేమ్‌ అండ్ సీన్స్‌ నెట్టింట వీరంగం సృష్టిస్తున్నాయి. ఇవన్నీ సినీ ప్రేక్షకుల్లో పుష్ప పార్ట్-2 ది రూల్ పై అంచనాలను అమాంతం రెట్టింపు చేస్తున్నాయి. ఈ మూవీ కోసం యావత్ సినీలోకం ఎంతో ఆతృతతో ఎదురుచూసేలా చేస్తున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగా ఏప్రిల్ 7న విడుదలైన పుష్ప 2 టీజర్ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ టీజర్ పుష్ప-2 సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఊరమాస్ లుక్ లో ఉన్న బన్నీ అవతారం చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆడియన్స్ అంచనాలకు మించి టీజర్ ఉండడంతో ఈసినిమాపై బాగా హైప్ క్రియేట్ అయ్యింది.

ఎన్నడూ బన్నీని చూడని ఇలా చూడలేదే(Pushpa-2 Poster)

ఇక ఈ తరుణంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలోని పుష్పరాజ్‌ అవతారం మాత్రం అందర్నీ ఒక్క నిమిషం ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయేలా చేస్తోంది. చూసేవారంతా కళ్లర్పకుండా ఆ ఫొటోనే చూసేలా చేస్తుంది. ఎప్పుడూ చూడని బన్నీని ఆ ఫొటోలో చూసి ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.

మూడు నిమిషాల 14 సెకండ్ల నిడివి ఉన్న వీడియో టీజర్ కంటే కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ ఫోటోనే అందరికీ కిక్కిస్తోందని చెప్పాలి. ఇంతకీ అంతలా ఆ ఫోటో ఏం ఉందంటే ఉగ్ర రూప దారి అయిన రాయలసీమలో కొలువై ఉన్న గంగమ్మ రూపంలోకి మారిన పుష్పరాజ్ అవతారం. పట్టు చీర కట్టుకుని, ముక్కు పుడక, బుట్ట కమ్మలు, చేతికి ఎర్రపు రంగు గాజులు, మెడలో బంగారు హారాలు, నిమ్మకాయలు, పూల దండలతో, ఎర్రగా మారిన కళ్లతో గంభీరంగా ఉండే గంగమ్మలా పుష్పరాజ్‌ ఈ ఫోటోలో కనిపించారు. ఇందంతా ఒకెత్తయితే ఉగ్రరూప అవతారంలో ఉన్న బన్నీ ఓ చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉండడం మరింత అటెన్షన్ ను గ్రాప్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫొటో కాస్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ #Pushpa2TheRule Begins!!!అంటూ రాసుకొచ్చారు.