Last Updated:

Real Estate Fraud: రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో భారీ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

రియల్ ఎస్టేట్ పేరిట మోసాలకు పాల్పడిన ఇద్దరినీ సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. వెంచర్లు వేస్తూ అమాయకులను బురిడీ కొట్టించారు. శుభోదయం కాకతీయ ఇన్ఫ్రా పేరిట వెంచర్లు వేశామని, అందులో పెట్టుబడులు పెట్టాలని పలువురిని నమ్మించారు.

Real Estate Fraud: రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో భారీ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన  సైబరాబాద్ పోలీసులు

 Real Estate Fraud: రియల్ ఎస్టేట్ పేరిట మోసాలకు పాల్పడిన ఇద్దరినీ సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. వెంచర్లు వేస్తూ అమాయకులను బురిడీ కొట్టించారు. శుభోదయం కాకతీయ ఇన్ఫ్రా పేరిట వెంచర్లు వేశామని, అందులో పెట్టుబడులు పెట్టాలని పలువురిని నమ్మించారు. పెట్టుబడి పెడితే రెండితలు లాభాలు వస్తాయని వారు చెప్పడం తో 14మంది పెట్టుబడులు పెట్టారు. పెట్టిన పెట్టుబడికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిస్తామని నమ్మించిన సదరు కంపెనీ నిర్వాహకులు 3కోట్లకు పైగా డబ్బులు వసూల్ చేసి ఎస్కేప్ అయ్యారు.

వెంచర్లు లేకుండా వసూళ్లు..( Real Estate Fraud)

శుభోదయం ఇన్‌ ఫ్రా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న లక్ష్మీ ప్రసాద్ అనే వ్యక్తి జనగామలోని ఖిలాషాపూర్ దగ్గర పెద్ద ఎత్తున వెంచర్లు వేస్తున్నామని ప్రచారం చేసాడు. ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయని లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఈ విధంగా కోట్ల రూపాయల మేరకు వసూలు చేసారు. అయితే అక్కడ వెంచర్లు అంటూ ఏమీ వేయలేదని కనుగొన్న కొంతమంది బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయగా ఇచ్చేది లేదని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శుభోదయం ఇన్ఫ్రా ఎండీ లక్ష్మి ప్రసాద్, అకౌంటెంట్ వెంకట సత్యసుధీర్ లను అరెస్టు చేసారు.

ఇవి కూడా చదవండి: