Last Updated:

Sagileti Katha Movie Review : “సగిలేటి కథ” మూవీ రివ్యూ.. ఊహించని ట్విస్టులు !

Sagileti Katha Movie Review : “సగిలేటి కథ” మూవీ రివ్యూ.. ఊహించని ట్విస్టులు !

Cast & Crew

  • రవి మహాదాస్యం (Hero)
  • విషిక లక్ష్మణ్ (Heroine)
  • నరసింహా ప్రసాద్ పంతగాని, రాజశేఖర్, తదితరులు (Cast)
  • రాజశేఖర్ సుడ్మూన్ (Director)
  • అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడ (Producer)
  • జశ్వంత్ పసుపులేటి (Music)
  • రాజశేఖర్ సుడ్మూన్ (Cinematography)
2.7

Sagileti Katha Movie Review : విలేజ్ లవ్ స్టోరీ అంటే అందరికీ ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. అలాంటి బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన చిత్రాలెన్నో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంగా వస్తున్న ఈ చిత్రాన్ని హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్ ప్రేక్షకుల నుండి అశేష ఆధరణ పొందడంతోపాటు, విడుదలైన సాంగ్స్ కి కుడా మంచి అప్లాజ్స్ రావడం విశేషం. అయితే ఈ సినిమా విషయానికి వస్తే విలేజ్ లవ్ స్టోరీతో పాటుగా లోలోపల రివేంజ్ డ్రామాను కూడా చూపించారు. మరి రరేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సగిలేటి కథతో నవదీప్ సీ స్పేస్ నిలబడుతుందా? హీరో హీరోయిన్లకు మంచి పేరు వస్తుందా? లేదా? అన్నది ప్రీమియర్ రివ్యూ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ.. 

రాయలసీమలోని సగిలేరు గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఊరు అన్నాక.. అన్ని రకాల మనుషులు ఉంటారు. ఆ ఊర్లో ప్రెసిడెంట్ చౌడప్ప (రాజ శేఖర్ అనింగి), ఆర్ఎంపీ దొరసామి (రమేష్)లు స్నేహితుల్లా ఉంటారు. చౌడప్ప కొడుకు కుమార్ (రవి మహాదాస్యం), దొరసామి కూతురు కృష్ణ కుమారి (విషిక కోట) ప్రేమలో పడతారు. ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అంతా బాగుందనే సమయానికి మాంకాలమ్మ జాతర్లో దొరసామిని చౌడప్ప నరికేస్తాడు. ఆ తరువాత జరిగిన కథ ఏంటి? వీరి ప్రేమ కథ ఎలా ముందుకు సాగింది? చివరకు వీరిద్దరూ ఒక్కటయ్యారా? లేదా? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

మూవీ విశ్లేషణ (Sagileti Katha Movie Review)..

సగిలేటి కథ అంటే.. ఓ ఊరి కథ. ఊరు అంటే.. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ప్రేమ, పగలు, ద్వేషాలు, స్వార్థాలు, బడాయి మాటలు చెప్పుకుని తిరిగే వారుంటారు. చికెన్ తినాలనే చిరకాల వాంచ కలిగిన ఓ రోషగాడు కూడా ఉంటాడు. అలా అన్ని పాత్రలను చుట్టూ సగిలేటి కథను బాగానే రాసుకున్నాడు దర్శకుడు. ఆ పాత్రలను జనాలకు కనెక్ట్ చేయడంలోనూ సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. కాకపోతే కథ పరంగా ఏమీ కొత్తగా అనిపించదు. కథనం కూడా నీరసంగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ జనాలను మాత్రం థియేటర్లో నవ్విస్తారు. ఓ రెండు గంటల పాటు కూర్చోబెట్టేస్తారు. సినిమా అంతా ఒకెత్తు అయితే చివర్లో వచ్చే ట్విస్టులు ఇంకో ఎత్తు. అప్పటి వరకు చూసిన పాత్రలకు చివర్లో కనిపించే కారెక్టర్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం అందరికీ నచ్చుతుంది. వాడేంటి? ఇలా చేశాడు? అని అందరూ అనుకుంటారు. అలా చేయడంతో దర్శకుడు సఫలం అయ్యాడు. గ్రామీణ వాతావరణాన్ని, 2007 బ్యాక్ డ్రాప్‌ను బాగానే చూపించారు. చికెన్ మాత్రం అందరికీ నోరూరేలా చేస్తుంది. నిడివి తక్కువ ఉండటం సినిమాకి కలిసొచ్చే అంశం.

ఎవరెలా చేశారంటే.. 

కుమార్ పాత్రలో రవి చక్కగా నటించాడు. కొన్ని చోట్ల అమాయకంగా కనిపించాడు. ఇంకొన్ని చోట్ల ఎమోషనల్‌గా అనిపించాడు. పక్కింటి కుర్రాడిలా మెప్పిస్తాడు. ఇక కృష్ణ కుమారిగా విషిక అద్భుతంగా నటించింది. గడుసరి పిల్లగా, మగరాయుడిలా మెప్పించింది. అందం, నటనతో కుర్రకారును కట్టిపడేస్తుంది. మిగిలిన పాత్రలో చౌడప్ప, ఊరి ప్రెసిడెంట్ తాత, హీరో తల్లి పాత్రలు బాగున్నాయి. అన్ని కారెక్టర్లు తమ పాత్రలకు న్యాయం చేస్తారు. సాంకేతికంగానూ ఈ సినిమా మెప్పిస్తుంది. విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి.  మ్యూజిక్ కూడా బాగుంటుంది.  నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు ఓ మంచి ప్రయత్నం చేశారు.

కంక్లూజన్.. 

ప్రతి ఊరిలో ఉండే కథ.. మన కథ

Sagileti Katha Movie

ఇవి కూడా చదవండి: