Last Updated:

Kasani Gnaneshwar : తెలంగాణలో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది – కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తెదేపా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు తెదేపా చజాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో ములాఖత్ అయ్యారు. నారా లోకేష్, భువనేశ్వరి తో పాటు ఆయన కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత

Kasani Gnaneshwar : తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తెదేపా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఈ మేరకు ఈరోజు తెదేపా చజాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో ములాఖత్ అయ్యారు. నారా లోకేష్, భువనేశ్వరి తో పాటు ఆయన కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల అంశం గురించి ఆదివారం ఉదయం లోకేష్ తో చర్చించి ఫైనల్ చేస్తామన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగానే ఉందని.. తనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని కానీ ఆ పార్టీలో చేరుతానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తన దృష్టిలో తెలంగాణలో టీడీపీ మాత్రమే బెస్ట్ అని అన్నారు.