Platform 65 : నోరూరించే “క్లాసిక్ మష్రూమ్” వంటకాన్ని పరిచయం చేసిన ప్లాట్‌ఫామ్ 65..
విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత వంటల కేంద్రమైన ప్లాట్‌ఫారమ్ 65, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ అయిన చెఫ్ విహెచ్ సురేష్ తన తాజా వంటకం "క్లాసిక్ మష్రూమ్" ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్లాట్‌ఫారమ్ 65, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ విహెచ్ సురేష్ మాట్లాడుతూ.. “మా తాజా సృష్టి, క్లాసిక్ మష్రూమ్ రెసిపీతో మీ వంటల
Platform 65 : విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత వంటల కేంద్రమైన ప్లాట్‌ఫారమ్ 65, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ అయిన చెఫ్ విహెచ్ సురేష్ తన తాజా వంటకం “క్లాసిక్ మష్రూమ్” ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్లాట్‌ఫారమ్ 65, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ విహెచ్ సురేష్ మాట్లాడుతూ.. “మా తాజా సృష్టి, క్లాసిక్ మష్రూమ్ రెసిపీతో మీ వంటల అనుభవాన్ని మరింత మెరుగుపరచుకోండి. అద్భుతమైన క్రాంచీ రుచిని కలిగిన ఈ వంటకం ఆహార ప్రియులకు తక్షణ ఇష్టమైనదిగా మారింది. జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న పదార్థాలు మరియు వినూత్నమైన వంట పద్ధతిని ఉపయోగించి రూపొందించబడిన క్లాసిక్ మష్రూమ్ రెసిపీ మీకు నోరూరించే రుచితో పాటు సంతోషకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది” అని తెలిపారు.
క్లాసిక్ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
మీడియం సైజ్ – 180 గ్రాములు, మైదా ½ స్పూన్ – పది గ్రాములు, కార్న్ ప్లేవర్ ½ స్పూన్ – 20 గ్రాములు, ఉప్పు- తగినంత, చక్కెర ½ స్పూన్ – 05 గ్రాములు, తెల్లమిరియాలు – 05 గ్రాములు, క్రీమ్ – రెండు టీస్పూన్లు – 100 ఎంఎల్, అల్లం ముక్కలు ½ స్పూన్ – 05 గ్రాములు, తరిగిన వెల్లుల్లి ½ స్పూన్ – 05 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 1 చెంచా – 10 గ్రాములు, గార్నిష్ కోసం స్ప్రింగ్ ఆనియన్ – 05 గ్రాములు నూనె – 250 మీ.లీ మరియు వెన్న – 10 గ్రాములు.
క్లాసిక్ మష్రూమ్ తయారు చేయు విధానం (Platform 65)..
స్టెప్ 1 – ఉడికించిన పుట్టగొడుగులను తీసుకుని, మైదా + మొక్కజొన్న పిండి + చక్కెర + ఉప్పు + మరియు మిరియాలు వేసి బాగా కలపాలి.
స్టెప్ 2- బ్రౌన్ కలర్ వచ్చేవరకు మష్రూమ్ ఫ్రై కంటే నూనెతో స్లో ఫైర్ చేసి, ఆపై నూనెను తీసివేయండి.
స్టెప్ 3- వోక్ ను తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేయాలి. దోరగా వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయి ముక్కలు, అల్లెం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలిపెట్టాలి. కొద్దిపాటి మంటతో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెలిగించాలి.
స్టెప్ 4 – అందులో ఫ్రై మష్రూమ్ వేసి ఉప్పు + పంచదార, మిరియాలు వేసి బాగా కలపాలి.
స్టెప్ 5- పైన పెట్టిన పళ్ళెంను తొలగించాలి.
స్టెప్ 6- మష్రూమ్ పై భాగంలో క్రీమ్ ను అప్లై చేయాలి.
స్టెప్ 7 – కొంచెం కాజు , స్ప్రింగ్ ఆనియన్ తో అలంకరించండి.
ఇప్పుడు మీరు క్లాసిక్ మష్రూమ్ తినడానికి సిద్ధంగా ఉంది
క్లాసిక్ మష్రూమ్ వంటకం యొక్క అసమానమైన రుచి మీరు ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నా, రుచికరమైన భోజనాన్ని అందించినా, లేదా మీ అతిథులను ఆకట్టుకోవాలనుకున్నా, ఈ వంటకం చిరస్మరణీయమైన అనుభూతిని అందజేస్తుంది, ఇది ప్రతి ఒక్కరికీ మరిన్ని ఆకలి కోరికలను కలిగిస్తుంది. “ఈ వంటకం నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది,” అని చెఫ్ సురేష్ చెప్పారు.