Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉందని తెలుసా..!
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే నవంబర్ 9వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే నవంబర్ 9వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
మేషం..
ఉద్యోగం పరంగా సమయం ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉంది. మనసులోని కోరికల్లో ఒకటి తప్పకుండా నెరవేరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి.
వృషభం..
ఆర్థిక పరిస్థితి పెరుగుదల ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది. శుభ కార్యాలు, దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరగడంతో పాటు, ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మిథునం..
ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం, అధికార యోగం పట్టడం, కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వల్ల నష్టపోతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కొందరు మిత్రులు స్వార్థానికి ఉపయోగించుకుంటారు.
కర్కాటకం..
వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పిల్లలు చదు వుల్లో విజయాలు సాధించడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. డబ్బు విషయంలో సన్నిహితులు తప్పుదారి పట్టించడం జరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
సింహం..
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. విదేశీ కంపెనీల నుంచి కూడా నిరుద్యోగు లకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆలయాల సంద ర్శన, తీర్థయాత్రలు చోటు చేసుకుంటాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
కన్య..
డబ్బుపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ధన స్థానంలో ఉన్న కుజ, రవుల వల్ల ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు న్నాయి. సప్తమ స్థానంలో సంచరిస్తున్న రాహువు వల్ల ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి టెన్షన్ పెడుతుంది. కుటుంబ విషయాలు సానుకూలంగానే ఉంటాయి.
తుల..
స్వల్ప అనారోగ్యా లకు, వైద్య ఖర్చులకు కూడా అవకాశం ఉంది. కొందరు మిత్రులు ఆర్థికంగా నష్టపరిచే సూచనలు న్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
వృశ్చికం..
వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సతీమణి వైపు నుంచి అనుకూలత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆస్తికి సంబంధించి శుభవార్త వినడం జరుగు తుంది.
ధనస్సు..
ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఉద్యోగ స్థానాధిపతి బుధుడు వ్యయంలో ఉండడం, ఉద్యోగ స్థానంలో కేతువు ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోవద్దు.
మకరం..
ఆర్థిక సమస్యలను తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.
కుంభం..
ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. విదేశీ యాత్రలకు అవ కాశం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే సూచనలున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏలిన్నాటి శని కారణంగా ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి.
మీనం..
ఆదాయానికి లోటుండదు కానీ, స్వల్ప అనా రోగ్యానికి మాత్రం అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. బరువు బాధ్య తలు పెరగడం, విశ్రాంతి లేకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.