mancherial crime:తెలంగాణ రాష్ట్రంలో ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా, ఆర్థికంగా మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రేమ పేరుతో మోసం చేసి అబార్షన్ చేయించడంతో వైద్యం వికటించి యువతి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
daughter poisons parents for love marriage in vikarabad district: వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులకు కూతురు విషం ఇంజక్షన్ ఇచ్చి చంపింది. అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని తొలుత భావించారు.
murder in uttar pradesh:ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి తనతో పెళ్లికి ఒప్పుకోలేదని దారుణానికి పాల్పడ్డాడు. ఆ యువతిని ఆఫీసుకు పిలిచి మరి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆగ్రా నగరంలో ఆమె శరీర భాగాలను యుమనా నదిలో పడేశాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
murder in prakasam:ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారనే కారణంతో భార్యలే తమ భర్తలను చంపిన ఘటనలు ప్రతీరోజు ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తున్నాయి.పెద్దారవీడు మండల పరిధిలో వివాహేతర సంబంధానికి అడ్డిస్తున్నాడనే కారణంగా భర్తను తమ్ముడి సాయంతో కళ్లలో కారం కొట్టి ఓ భార్య చంపిందని డీఎస్పీ నాగరాజు తెలిపారు.
wife killed husband in gunturu:ఆంధ్రప్రదేశ్ మరో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం ఒంటరిగా కూర్చుని రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తు సంతోషంగా గడిపింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. దీనిపై మంగళగిరి గ్రామీణ సీఐ వెంకటబ్రహ్మం, దుగ్గిరాల ఎస్సై వెంకటరవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి
murder in medak: తెలంగాణలోని మెదక్ జిల్లాలో మరో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.22 బాకీ కోసం స్నేహితుడినే హత్య చేసిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది.
mother poisons two children then dies by suicide:పిల్లలు అంటే తల్లిదండ్రలకు ఎంతో ప్రేమ ఉంటుంది. చిన్నప్పటి నుంచి తమ పిల్లలను ఎంతో అపురూపంగా పెంచుతారు. కానీ ఈ మధ్య కాలంలో కన్న బిడ్డలను తల్లిదండ్రులు కడతేర్చుతున్నారు. తల్లి అయితే కన్న బిడ్డలను తమ కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపిన ఘటన ఏపీలో నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఆమె ఈ ఘటనకు పాల్పడి తర్వాత సూసైడ్ చేసుకుంది.
karimnagar police arrest husband and wife:తమ వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ఓ దంపతులు అడ్డదారి తొక్కిన బాగోతం బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా.. అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి సమాజంలో డబ్బున్న వారే లక్ష్యంగా వలపు వల విసిరారు. హనీ ట్రాప్ పేరుతో చిక్కిన వారిని బ్లాక్ మెయిల్ చేసి భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేసేవారు. ఎట్టకేలకు ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వీరి గుట్టు బయటపడింది.
murder in bangalore: బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కేసులో కీలక విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కరెంట్ షాక్ కారణంగా ఊపిరాడక మృతి చెందిందని మొదట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమెను ఓ టీనేజర్ హత్య చేసినట్లు తాజాగా పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోలీసులు బీఎన్ఎస్ 103(1), 64 (2), 66, 238 కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
goat blood: తెలంగాణలో బతికి ఉన్న గొర్రెలు, మేకల నుంచి రక్తం తీసి వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.
warangal: వరంగల్ చౌరస్తాలో ఓ వివాహిత కత్తి పట్టుకుని నానా హంగామా చేసింది. తన భర్త శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, భర్తను చంపేస్తానంటూ.. కత్తితో హల్ చల్ చేసింది.
murder in hyderabad:తెలంగాణలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొందరు హత్యలు చేస్తున్నారు. ముఖ్యంగా నడిరోడ్డుపైనే హత్యలు చేస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యపై పెట్రోల్ పోశాడు ఓ భర్త. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. త్రివేణి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
murder by supari gang in karimnagar district:కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ మామ. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని సుపారీ గ్యాంగ్‌తో సొంత కుమారుడినే హత్య చేయించిన ఘటన కలకలం రేపుతుంది. హత్య అనంతరం మిగిలిన సుపారీ డబ్బుల కోసం నిందితులంతా ఒకే చోటుకు చేరడంతో వారిని పోలీసులు పట్టుకున్నట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మీడియాతో వెల్లడించారు.
hyderabad: హైదరాబాద్ నగరంలో దారుణ హత్యలు కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపారు. బీటెక్ విద్యార్థి ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో యువకుడిని పెళ్లి జరిపిస్తామంటూ ఇంటికి పిలిచి హత్య చేసిన ఘటన పటాన్‌చెరులో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తోంది.
tg:తెలంగాణలో ఇటీవల కాలంలో హత్యలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్నను తమ్మడు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బీమా డబ్బుల కోసం ఓ వ్యక్తి.. సొంత అన్నను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అన్నను టిప్పర్‌తో ఢీకొట్టి చంపి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడని పోలీసులు తెలిపారు.
hyd: సికింద్రాబాద్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని కొందరు దుండగులు ఆటోలో వచ్చి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని ఎర్రకుంట సమీపంలో పడేసి వెళ్లిపోయారు. తార్నాక ప్రాంతంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
ap:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని నాగార్జునసాగర్ కుడి కాలువలో ఓ ప్రేమజంట దూకి సూసైడ్‌కు పాల్పడింది. ఈ ప్రేముకుల ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపుతోంది. మాచర్ల పట్టణానికి చెందిన వీర్ల గోవర్ధన్ యాదవ్, దాసరి శ్రీలక్ష్మి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సాగర్ కుడి కాలువ వద్ద ఉన్న బొంబాయి కంపెనీ వంతెనపై నుంచి ఇద్దరూ కాలువలోకి దూకి ప్రాణాలు తీసుకున్నారు.
ap: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో తల్లి, కుమారుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడి సాంబశివరావు(36) అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేయగా స్పాట్‌లోనే మృతి చెందాడు.
daughter in law kills mother in law in visakapatnam: విశాఖలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అత్తను కాళ్లు, చేతులు కట్టేసి, పెట్రోల్ పోపీ, నిప్పంటించి. ఈ ఘటన విశాఖ gvmcలోని 98వ వార్డు అప్పన్నపాలెంలో చోటుచేసుకుంది.
fake ias officer: కామారెడ్డి కలెక్టరేట్ కు ఓ మహిళ కొత్తగా ఇంచార్జ్ కలెక్టర్ గా వచ్చినని, నానా హంగామా చేసింది. వెంటనే తన దగ్గర ఉన్న డామ్మీ ఉత్తర్వులను సిబ్బందికి చూపించింది. అక్కడినుంచి కలెక్టర్ ఛాంబర్ వైపు వెళ్లి ఐఏఎస్ నంటూ అందరితో పరిచయం చేసుకుంది. ఇప్పటి వరకు తాను సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో కమిషనర్‌గా పని చేస్తున్నట్లు చెప్పి నమ్మించే పని చేసింది.
constable on betting games: బెట్టింగ్ గేమ్స్ కు రాష్ట్రంలో మరో కానిస్టేబుల్ బలయ్యాడు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడారు. వివరాల్లోకి వెళ్లితే, సంగారెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్‌కి చెందిన సందీప్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సందీప్ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వ్యసనానికి లోనై ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.
bus conductor radha: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మరణించారు. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ప్రమాదం నుంచి బయట పడిన బస్సు కండక్టర్ రాధ భయానక ఘటన గురించి వివరించింది. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇది చోటు చేసుకుందని, అంతా క్షణాల్లో జరిగిపోయిందని, టిప్పర్ చాలా వేగంగా వస్తున్నదని నేను, మా డ్రైవర్ గమనించాము. వెంటనే డ్రైవర్ బస్సును పక్కకు తిప్పేలోపే ఈ ఘటన జరిగిందని వివరించింది.
jaipur road crash: రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం తాగి డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న ట్రక్కు డ్రైవర్ ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ పోయాడు. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా.. 50మందికిపైగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.