Last Updated:

Medak Road Accident: మెదక్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వ్యక్తులు.. 100 మేకలు మృతి

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం చౌరస్తా వద్ద హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని మరో లారీని ఢీకొనడంతో ఐదుగురు  వ్యక్తులు మృతి చెందగా 100 కు పైగా మేకలు కూడా చనిపోయాయి.నాగ్‌పూర్‌కు చెందిన డ్రైవర్ శుక్లాల్ మినహా మరణించిన మరియు గాయపడిన వారందరూ మధ్యప్రదేశ్ కు చెందిన వారని తెలుస్తోంది

Medak Road Accident: మెదక్‌ జిల్లాలో  రోడ్డు ప్రమాదం..  ఐదుగురు వ్యక్తులు..  100 మేకలు మృతి

Medak Road Accident: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం చౌరస్తా వద్ద హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని మరో లారీని ఢీకొనడంతో ఐదుగురు  వ్యక్తులు మృతి చెందగా 100 కు పైగా మేకలు కూడా చనిపోయాయి.నాగ్‌పూర్‌కు చెందిన డ్రైవర్ శుక్లాల్ మినహా మరణించిన మరియు గాయపడిన వారందరూ మధ్యప్రదేశ్ కు చెందిన వారని తెలుస్తోంది.

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ ..(Medak Road Accident)

ఈ ప్రమాదంలో గాయపడిని వారికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం వారిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా తూప్రాన్‌ డీఎస్పీ ఎస్‌.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అన్నారు. మేకల యజమానులు రాజు, మనీష్‌కుమార్‌లు మధ్యప్రదేశ్‌కు చెందినవారని, వాటిని నాగ్‌పూర్‌లో కొనుగోలు చేసి హైదరాబాద్‌కు వచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు కౌడిపల్లి మండలం తుంకి వద్ద లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని జక్కపల్లికి చెందిన మహేష్ గౌడ్ (36).గా గుర్తించారు. మహేశ్​ గౌడ్ అర్ధరాత్రి 12 గంటలకు నర్సాపూర్ నుంచి సొంత పనుల నిమిత్తం తునికి గ్రామానికి కారులో వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

 

ఇవి కూడా చదవండి: