IQOO 13: ఐక్యూ అరాచకం.. ఊహించని ప్రైస్‌తో కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
IQOO 13: ఐక్యూ త్వరలో కొత్త మొబైల్‌ను విడుదల చేయనుంది. డిసెంబర్ 5న ఇండియన్ మార్కెట్లోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ iQoo 13 పేరుతో విడుదల కానుంది. ఈ ఫోన్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా లీక్ అయింది. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
IQOO 12 ఫోన్‌కు సక్సెసర్‌గా కంపెనీ IQOO 13 ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది AMOLED డిస్‌ప్లే అవుతుంది. ఈ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 144Hz. అలాగే 2K రిజల్యూషన్ అందుబాటులో ఉంది. ఇది Qualcomm Snapdragon చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఈఐక్యూ 13 ఫోన్ 6150mAh బ్యాటరీతో లాంచ్ కానుంది.
ప్రాసెసర్‌గా కంపెనీ ఐక్యూ 13 ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Gen 4 చిప్‌సెట్‌ను అందించే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో సందడి చేసిన ఐక్యూ 12 ఫోన్‌లో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఉంది. ఈ ఐక్యూ 13 మొబైల్ 16GB RAM + 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ని కలిగి ఉంటుంది. ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.
ందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో కెమెరా ఉంటుంది. మొబైల్ 6,150mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని వేగంగా ఛార్జ్ చేయడానికి, 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ సిమ్, 5G, 4G, బ్లూటూత్, IP68 రేటింగ్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. లీక్ ప్రకారం ఐక్యూ 13 మొబైల్ భారతీయ మార్కెట్లో రూ.55,000 ధరతో విడుదల కానుంది. లాంచ్ టైమ్‌లైన్ గురించి మాట్లాడితే డిసెంబర్ 5 న భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుంది. దీనికి ముందు చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.