Last Updated:

Japan Movie Review : కార్తీ “జపాన్” సినిమా రివ్యూ, రేటింగ్..?

Japan Movie Review : కార్తీ “జపాన్” సినిమా రివ్యూ, రేటింగ్..?

Cast & Crew

  • కార్తీ (Hero)
  • అనూ ఇమ్మాన్యుయేల్ (Heroine)
  • సునీల్, కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు (Cast)
  • రాజు మురుగన్ (Director)
  • ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు (Producer)
  • జీవీ ప్రకాష్ కుమార్ (Music)
  • ఎస్. రవి వర్మన్ (Cinematography)
2.5

Japan Movie Review : తమిళ, తెలుగు ఆడియెన్స్‌కు ప్రముఖ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. యుగానికి ఒక్కడు, ఆవారా, వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఆ తరావ్త తనదైన శైలిలో సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ మరింత చేరువయ్యాడు. ఇక ఖైదీ, పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో స్టార్ హీరో రేంజ్ సంపాదించుకున్నాడు.  ఇక తెరపైనే కాకుండా నెట్టింట కూడా ఫుల్ జోష్ గా ఉంటూ తన అభిమానులను అలరిస్తుంటాడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో. ప్రస్తుతం తన 25వ చిత్రం జపాన్‌లో నటిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేసింది. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఇక మూవీ ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా రివ్యూ, రేటింగ్..

మూవీ కథ (Japan Movie Review).. 

హైదరాబాద్ సిటీలోని ఒక జ్యువెలరీ షాప్ లో రూ. 200 కోట్ల విలువలైన నగలు, ఆభరణాలు దోచేస్తారు. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ రాబరీ చేశాడని అనుమానిస్తారు. శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్)… ఇద్దరి నేతృత్వంలోని రెండు బృందాలు జపాన్ కోసం వేట మొదలు పెడతాయి. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా అతని కోసం వెతుకుతారు. దోచుకున్న డబ్బుతో సినిమాలు తీసిన జపాన్, స్టార్ హీరోయిన్ సంజు (అనూ ఇమ్మాన్యుయేల్) మీద మనసు పారేసుకుంటాడు. ఆమె కోసం జపాన్ వెళితే.. అతడిని పోలీసులు రౌండప్ చేస్తారు. అప్పుడు జరిగిన రాబరీ గురించి జపాన్ తెలుసుకుంటాడు. తాను ఆ దొంగతనం చేయలేదని చెబుతాడు. జపాన్ కాకపోతే ఆ దొంగతనం చేసింది ఎవరు ? ఈ కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? ఆ తర్వాత అసలు ఎం జరిగింది అనేది థియేటర్లో చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. 

వరుస హిట్ల తర్వాత కార్తి చేసిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తన డైలాగ్ డెలివరీ, కార్తీ పర్ఫామెన్స్ థియేటర్లకు రప్పించాయి. ఇక్కడ వరకు సక్సెస్ అయినా కానీ ప్రేక్షకులను ఎంటర్ టైం చేయడంలో మాత్రం మూవీ టీం విఫలం అయ్యిందనే చెప్పాలి. కారెక్టరైజేషన్ పరంగా మాత్రం జపాన్ అదరగొడితే.. స్టోరీ పరంగా మాత్రం చేతులెత్తేశారు. దొంగ, పోలీస్ మధ్య మూవీ అంటే పిల్లి – ఎలుక టైపులో ఉంటుందేమో అనిపిస్తుంది. అయితే.. ఆ ఆశలు తొలగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. స్క్రీన్ ప్లే కూడా వీక్ అయిపోయింది.

ఫస్టాఫ్ అక్కడక్కడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఓకే అనిపించినా.. ఆ తర్వాత కథ మరింత నీరసంగా సాగుతుంది. కానీ సెకండాఫ్ మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. క్లైమాక్స్ మరింత డల్. దర్శకుడు రాజు మురుగన్ మంచి ఛాన్స్ మిస్ చేసాడు. ఓవరాల్‌గా జపాన్.. మేడ్ ఇన్ చైనా ప్రాడక్ట్‌లా తుస్సుమంది. ప్రతి వారం థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులకు మాత్రం సినిమా రిఫరెన్స్ డైలాగులు, సినిమాలపై వేసిన పంచ్ డైలాగులు నవ్విస్తాయి. పోలీస్ వ్యానులో సింబాలిజం, క్రింజ్, రివ్యూ రైటర్స్, సి సెంటర్ ఆడియన్స్ అంటూ కార్తీ చేసిన సీన్ అందరినీ నవ్విస్తుంది. చివరిలో చెప్పే ఫ్లాష్ బ్యాక్ సీన్ బేస్ చేసుకుని సినిమా తీసి ఉంటే పెద్ద హిట్ అయ్యేదని అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే.. 

క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా జపాన్ యాస పలకడం కోసం ఆయన శ్రమించారు. హెయిర్ స్టైల్, డ్రసింగ్ స్టైల్ ఛేంజ్ చేశారు. అను ఇమ్మానియేల్ మరోసారి ఇలా కనిపించి మాయమయ్యే పాత్రలో నటించింది.  లుక్, గెటప్… సరైన క్యారెక్టర్ లభించడంతో సునీల్ సూపర్ అనిపించారు. ఆయన కోసం అన్నట్లు మధ్యలో కామెడీ సీన్లు కూడా ఉన్నాయి. భవాని పాత్రలో విజయ్ మిల్టన్ యాక్టింగ్ ఓకే. కెఎస్ రవికుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. టెక్నికల్ అంశాల పరంగా చూసినా ‘జపాన్’ ఆకట్టుకోవడం కష్టం. సినిమాటోగ్రఫీలో డార్క్ థీమ్, లో లైట్ ప్యాట్రన్స్ ఫాలో అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో మళ్ళీ వినాలనిపించే పాటలు లేవు. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అనుకున్నవి ఏవీ వర్కవుట్ కాలేదు. తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.

కంక్లూజన్.. 

జపాన్.. కానీ మేడ్ ఇన్ చైనా

ఇవి కూడా చదవండి: