Last Updated:

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో నేడు ప్రచారంలో పాల్గొనబోయే పలు పార్టీల అగ్ర నేతలు ఎవరు? ఎక్కడంటే ??

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో అధికార, ప్రాతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో నేడు ప్రచారంలో పాల్గొనబోయే పలు పార్టీల అగ్ర నేతలు ఎవరు? ఎక్కడంటే ??

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో అధికార, ప్రాతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు జోరుగా ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ కు లో రేవంత్ రెడ్డితో పాటు రాహుల్, ప్రియాంక, ఖర్గేలాంటి బడానేతలంతా క్యాంపెయిన్ లో భాగం అవుతున్నారు. మరోవైపు బీజేపీకి అండగా ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, పవన్ కళ్యాణ్, జెపి నడ్డా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక నేడు ఎవరెవరు..ఎక్కడెక్కడ.. ప్రచారం చేస్తున్నారో మీకోసం ప్రత్యేకంగా..

బీఆర్ఎస్..

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అలానే కేటీఆర్ కూడా వరుసగా రోడ్ షో లు, సభ లతో ప్రజలతో మమేకం అవుతున్నారు. వీరితో పాటు హరీష్ రావు, కవిత కూడా పలు చోట్ల ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

కాంగ్రెస్..

కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. అగ్ర నేతలు అయిన ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ప్రియాంక గాంధీ మూడు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో కలిసి ప్రియాంక గాంధీ.. భువనగిరి, గద్వాల్, కొడంగల్ లలో ప్రచారం నిర్వహిస్తారు. అలానే నర్సాపూర్ లో సాయంత్రం నాలుగున్నర గంటలకు ఏఎస్ఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

బీజేపీ..

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు.. ఉదయం మహబూబాబాద్ లో, మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్ లో జరిగే బహిరంగ సభల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు రోడ్ షోలో పాల్గొంటారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉదయం హుజురాబాద్ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత పెద్దపల్లిలో జరిగే రోడ్ షోలో ఉదయం 11 గంటలకు పాల్గొంటారు. మంచిర్యాలలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఉదయం 10 గంటలకు జగిత్యాల రోడ్ షోలో, 11 గంటలకు బోధన్ లో బహిరంగ సభ, మధ్యాహ్నం ఒంటిగంటకు బాన్సువాడలో బహిరంగ సభ, మధ్యాహ్నం రెండున్నర గంటలకు జుక్కల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు.