Last Updated:

Maa Oori Polimera 2 Movie Review : సత్యం రాజేష్ “మా ఊరి పొలిమేర 2” ప్రేక్షకులను భయపెట్టిందా.. రివ్యూ, రేటింగ్ ??

Maa Oori Polimera 2 Movie Review : సత్యం రాజేష్ “మా ఊరి పొలిమేర 2” ప్రేక్షకులను భయపెట్టిందా.. రివ్యూ, రేటింగ్ ??

Cast & Crew

  • 'స‌త్యం' రాజేష్‌ (Hero)
  • డా. కామాక్షి భాస్కర్ల (Heroine)
  • 'గెట‌ప్' శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, 'చిత్రం' శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు (Cast)
  • డా. అనిల్ విశ్వ‌నాథ్‌ (Director)
  • గౌరి కృష్ణ‌ (Producer)
  • గ్యాని (Music)
  • ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి (Cinematography)
2.7

Maa Oori Polimera 2 Movie Review : సత్యం రాజేష్‌, కామాక్షి, బాలాదిత్య, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకుడుగా కరోనా టైమ్ లో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. చివరి 20 నిమిషాలు ప్రేక్షకులు షాక్ అయ్యారని చెప్పాలి. తాంత్రిక పూజలు, మాంత్రిక విద్యలు, చేతబడి వంటి నేపథ్యంలో సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టేసాయి. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ గా వస్తున్న “మా ఊరి పొలిమేర 2” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగానికి మించి థ్రిల్‌ను పంచేలా ఈ మూవీ ఉంటుందని మూవీ యూనిట్ చెబుతున్నారు. ఈ మేరకు నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందో లేదో రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

మూవీ కథ.. 

సరిగ్గా మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే ఈ రెండో భాగం మొదలైంది. ఊరిలో చెతబడులు చేస్తూ మరణించాడని అనుకుంటున్న కొమురయ్య(సత్యం రాజేష్)ను అతని తమ్ముడు జంగయ్య(బాలాదిత్య) బయలుదేరతాడు. జంగయ్య మిస్ అవడంతో అతన్ని వెతుక్కుంటూ బయలుదేరిన కొత్త ఎస్సై(రాకేందు మౌళి) అనూహ్యంగా కొమురయ్య స్నేహితుడు(గెటప్ శ్రీను) కూడా కేరళ శబరిమల వెళ్లి మిస్ అయినట్టు తెలుసుకుంటాడు. దీంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్లగా అక్కడ కొమురయ్య అతని స్నేహితుడికి జరిగిన కథ అంతా చెబుతుంటే వింటాడు. ఇక ఈ క్రమంలో కొమురయ్య తాను ప్రేమించిన కవిత(రమ్య పొందూరి)ని కేరళ ఎలా తీసుకు వెళ్ళాడు? గెటప్ శ్రీను భార్య రాముల(సాహితి దాసరి) ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయింది? అసలు కవితను కొమురయ్య ఎందుకు కేరళ తీసుకువెళ్లాడు? కొమురయ్యకి ప్రతిరోజూ నిధి గురించి కలలు ఎందుకు వస్తున్నాయి? జాస్తిపల్లి ఊరి పొలిమేరలో గుడితో పాటు కేరళలో అనంత పద్మనాభ స్వామి గుడికి… కొమరయ్య చేసే చేతబడి పూజలకు సంబంధం ఏమిటి? కొమరయ్య చేసే చేతబడి గురించి భార్య లక్ష్మి (కామాక్షీ భాస్కర్ల)కు తెలుసా? జంగయ్య ఏమయ్యాడు? చివరకు ఏం తెలిసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

సినిమా విశ్లేషణ.. 

చిన్న సినిమాగా వచ్చిన పొలిమేర చిత్రం ఊహించని రీతిలో భారీ హిట్ సాధించింది. దాంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రమోషన్స్ కూడా తగ్గేదే లే అనే విధంగా ఫుల్ స్వింగ్ లో చేశారు. ‘మా ఊరి పొలిమేర’ ఓటీటీలో విడుదల కావడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులతో పాటు ఇళ్ళల్లో జనాలు కూడా చాలా మంది చూసి మంచి గుర్తింపు లభించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే.. ‘మా ఊరి పొలిమేర’ చూడని ప్రేక్షకులు సైతం ‘పొలిమేర 2’కు హ్యాపీగా వెళ్ళవచ్చు. ఆ మూవీని టైటిల్స్ పడేటప్పుడు క్లుప్తంగా చెప్పారు. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ఇంటర్వెల్ వరకు వచ్చే ట్విస్టులు ఆకట్టుకోవడం కష్టం.

ఇక అసలు కథ ఇంటర్వెల్ తర్వాత మొదలైంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ట్విస్టులు సర్‌ప్రైజ్ చేస్తాయి. సస్పెన్స్ మైంటైన్ చేశారు. మధ్య మధ్యలో చిన్న చిన్న థ్రిల్స్ ఇచ్చారు. అయితే… కథలో ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఎక్కువ. పార్ట్ 3 కోసం అన్నట్లు గుడి మిస్టరీని దాచడంతో కథను అసంపూర్తిగా ముగిసింది. నేపథ్య సంగీతం బావుంది. చివరిలో వచ్చే పెంచల్ దాస్ పాట పర్వాలేదు. ప్రొడక్షన్ డిజైన్ ఇంకా ఇంప్రూవ్ కావాలి.

ఎవరెలా చేశారంటే..

కొమురయ్య పాత్రలో సత్యం రాజేష్ జీవించాడు. కమెడియన్ ముద్రను మొదటి భాగంతో చెరిపేసుకున్న రాజేష్ ఈ రెండో భాగంలో కూడా రెచ్చిపోయి నటించాడు. ఇక ఆయన తరువాత ‘పొలిమేర 2’లో కామాక్షీ భాస్కర్ల క్యారెక్టర్ ఎక్కువ సర్‌ప్రైజ్ చేస్తుంది. పతాక సన్నివేశాల్లో ఆవిడ ద్వారా కొన్ని ట్విస్టులు రివీల్ చేశారు. నటిగా కూడా చక్కగా చేశారామె. సాహితి, రమ్య కూడా మంచి పాత్రలు పడడంతో ఒక రేంజ్ లో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక గెటప్ శ్రీను, చిత్రం శ్రీను, రాకేందుమౌళి, బాలాదిత్య వంటి వారు తమ తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. చివర్లో బబ్లూ పృథ్వీరాజ్ కనిపించింది ఒక్క సీన్లోనే అయినా ఎంట్రీతోనే అదరగొట్టేశాడు.

ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కథ మీద లానే స్క్రీన్ ప్లే విషయంలో కూడా కేర్ తీసుకుని ఉండాల్సింది. ట్విస్టుల మీద పెట్టే ఫోకస్ కధనం మీద కూడా పెట్టి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. డైలాగ్స్ ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఎడిటింగ్ ఎంత క్రిస్పీగా ఉన్నా నిడివి రెండు గంటలే ఉన్నా కానీ సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. పాటలు సో సో గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

కంక్లూజన్.. 

అంత కాకపోయినా భయపెట్టింది..

ఇవి కూడా చదవండి: