Last Updated:

800 Movie Review : ముత్తయ్య మురళీధరన్‌ లైఫ్ స్టోరీ “800” సినిమా ఎలా ఉందంటే..?

800 Movie Review : ముత్తయ్య మురళీధరన్‌ లైఫ్ స్టోరీ “800” సినిమా ఎలా ఉందంటే..?

Cast & Crew

  • మధుర్ మిత్తల్‌ (Hero)
  • మహిమా నంబియార్ (Heroine)
  • నరేన్, వేల తదితరులు (Cast)
  • ఎంఎస్ శ్రీపతి (Director)
  • వివేక్ రంగాచారి (Producer)
  • జిబ్రాన్‌ (Music)
  • ఆర్డీ రాజశేఖర్ (Cinematography)
3.5

800 Movie Review : ప్రముఖ శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌ అందరికీ సుపరిచితులే. స్పోర్ట్స్ బయోపిక్‌ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. క్రికెటర్స్ బయోపిక్స్ లో ఇప్పటికే `ఎంఎస్‌ ధోనీ`, కపిల్‌ దేవ్‌ `83`ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఈయన జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. మురళీ పాత్రలో మధుర్‌ మిట్టల్‌ నటించగా, ఆయన భార్య మదిమలర్‌ పాత్రలో మహిమా నంబియార్‌ నటించారు. ఎం.ఎస్‌.శ్రీపతి దర్శకత్వంలో.. శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, సింహళీ భాషల్లో విడుదలవుతోంది. టెస్ట్‌ క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

మూవీ కథ.. 

ముత్తయ్య మురళీధరన్‌ ది (మధూర్‌ మిట్టర్‌) తమిళనాడు నుంచి శ్రీలంకకి వలస వెళ్లిన ఫ్యామిలీ (శరణార్థులు). ముత్తయ్యకి చిన్నప్పట్నుంచి క్రికెట్‌ అంటే ఇష్టం. తమిళులపై కొందరు సింహాలియులు(శ్రీలంక) తరచూ దాడి చేస్తుంటారు. ఈ క్రమంలో తన తండ్రి బిస్కెట్ ఫ్యాక్టరీని కూడా కాల్చేస్తారు. అయినా తాను మాత్రం క్రికెట్‌ని వదల్లేదు. చర్చ్ లో ఫాదర్‌ సహకారంతో క్రికెట్‌ నేర్చుకుంటాడు. క్రికెటర్‌గా ఎదిగే ప్రతి చోట ఎదురైన అవమానాలు, అడ్డంకులు వాటిని దిగమింగుకుని, పడుతూ లేస్తూ ఎలా క్రికెటర్‌గా ఎదుగుతాడు అనేది చూపించారు. సెలక్ట్ అయినా, ఆడేందుకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? పై స్థాయిలో జరిగే చిన్న చూపేంటి? అంతర్జాతీయ క్రికెట్‌లో తన బౌలింగ్‌లో తలెత్తిన సమస్య ఏంటి? ఆయన కెరీర్‌ ఎందుకు వివాదంగా మారింది? దాన్ని ముత్తయ్య మురళీ ధరన్‌ ఎలా ఎదుర్కొన్నాడు. ఎందుకు తాను సడెన్‌గా రిటైర్‌మెంట్ ప్రకటించాడు? అనేది ఈ సినిమా కథ.

సినిమా విశ్లేషణ (800 Movie Review).. 

శ్రీలంక బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ కావడంతో ఆయన జీవితంలో చోటు చేసుకున్న అన్నీ విషయాలను చూపించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ముత్తయ్య క్రికెట్‌ ఆడిన తీరు కంటే దాని వెనకాల ఎదుర్కొన్న సంఘర్షణనే హైలైట్‌ చేశారు. ఆయన పెయిన్‌ని వెండితెరపై ఆవిష్కరించారు. తన జీవితంలో చాలా వివాదాలున్నప్పటికీ, వాటిని లైటర్‌ వేలో టచ్‌ చేస్తూ, తనకు ఎదురైన అవమానాలను, వాటికి మురళీధరన్‌ తన బంతితో ఎలా సమాధానం చెప్పాడనేది ఇందులో చూపించారు. తమిళీయుడు శ్రీలంక వాసి కాదని, తమ దేశం విడిచి వెళ్లిపోవాలనే దాడుల పరిస్థితి నుంచి తాను శ్రీలంక వాడినే అని, తాను ఓ క్రికెటర్‌ని అని, దేశం గర్వించేలా ముత్తయ్య మురళీధరన్‌ ఎదిగిన తీరుని, ఈ జర్నీని ఇన్‌స్పైరింగ్‌గా తెరకెక్కించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కి సెలక్ట్ అయినా, ఆడే అవకాశం ఇవ్వకపోవడం, అక్కడ కూడా పాలిటిక్స్ చేయడం, మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్న క్రమంలో అనూహ్యంగా ఆయన్ని పక్కన పెట్టడం, ఆస్ట్రేలియా తో ఆడేటప్పుడు ఏకంగా ఒకే టెస్ట్ మ్యాచ్‌లో 16 వికెట్లు తీసి వారిని దెబ్బకొట్టగా, దానికి ప్రతికారంగా, తన చేతి వాటం, విసిరే తీరునే ప్రశ్నించడం, దీనికి సంబంధించి ఆయన ఐసీసీ వద్ద పరీక్షని, తన నిజాయితీని నిరూపించుకునే తీరు, ఆయ సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా అనిపిస్తాయి. ఎల్‌టీటీ నాయకుడితో ఆయన మాట్లాడిన తీరు, రిటైర్ మెంట్‌ సీన్లు గుండెని బరువెక్కిస్తాయి.

800

ఎవరెలా చేశారంటే.. 

ముత్తయ్య మరళీధరన్‌ పాత్రలో మధుర్‌ మిట్టల్‌ అదరగొట్టాడు. పాత్రలో జీవించేశాడు. సినిమా చూస్తున్నంత సేపు ముత్తయ్య మురళీధరన్‌నే చూస్తున్నామనే ఫీలింగ్‌ కలుగుతుంది. బాడీ లాంగ్వేజ్‌ నుంచి, ఆయన హవభావాలు, యాక్షన్‌, బౌలింగ్‌ వేసే తీరు అచ్చు గుద్దేశాడు. ఎమోషనల్‌ సీన్లలో కళ్లతోనే నటించి మెప్పించాడు. అయితే మనకు తెలిసిన ఫేసులు లేకపోవడంతో ఆయా పాత్రలతో అంత ఈజీగా కనెక్ట్ కాలేం. ఇక అర్జున్‌ రణతుంగ పాత్రని హైలైట్‌గా చూపించారు. ఆ పాత్రలో నటుడు చాలా బాగా చేశాడు. మిగిలిన ఆర్టిస్టులు కూడా సహజంగా నటించారు. ముత్తయ్య గర్ల్ ఫ్రెండ్‌గా మహిమ మెప్పించింది. సంగీతం విషయంలో జిబ్రాన్‌ ఎమోషన్‌ని ఎలివేట్‌ అయ్యేలా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇవ్వలేకపోయారనిపిస్తుంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి. దర్శకుడు శ్రీపతి చాలా విషయాలను డీటెయిలింగ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొంత బ్యాలెన్స్ మిస్‌ అయ్యాడు. మొత్తానికి ఒక హానెస్ట్ అటెంప్ట్ ఇచ్చారు.

కంక్లూజన్.. 

ఇన్‌స్పైరింగ్‌ జర్నీ..

 

ఇవి కూడా చదవండి: