Last Updated:

Keedaa Cola Movie Review : తరుణ్ భాస్కర్ “కీడా కోలా” మూవీ ఎలా ఉందంటే.. రివ్యూ, రేటింగ్ ???

Keedaa Cola Movie Review : తరుణ్ భాస్కర్ “కీడా కోలా” మూవీ ఎలా ఉందంటే.. రివ్యూ, రేటింగ్ ???

Cast & Crew

  • బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, (Hero)
  • .. (Heroine)
  • రాగ్ మయూర్, 'రోడీస్' రఘురామ్, జీవన్ కుమార్, రవీందర్ విజయ్, 'టాక్సీవాలా' విష్ణు తదితరులు (Cast)
  • తరుణ్ భాస్కర్ దాస్యం (Director)
  • కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ (Producer)
  • వివేక్ సాగర్ (Music)
  • ఏజె ఆరోన్ (Cinematography)
2.7

Keedaa Cola Movie Review : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌.. వైవిధ్యభరిత చిత్రలత ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తరుణ్.. నటుడిగా ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికి డైరెక్టర్ గా మాత్రం బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన `కీడా కోలా` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. చైతన్య రావు,  రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. క్రైమ్, కామెడీ జోనర్లో నడిచే ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. హీరో రానా సమర్పణలో వివేక్ సుధాన్షు, శ్రీకృష్ణ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

దర్శకుడిగా పరిచయమైన ‘పెళ్లి చూపులు’, ఆ తర్వాత తీసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తీశారు. ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి?

సినిమా కథ (Keedaa Cola Movie Review).. 

వాస్తు (చైతన్యరావ్), తాత వ‌ర‌ద‌రాజు (బ్ర‌హ్మానందం) అనూహ్యంగా ఒక కోటి రూపాయలు కట్టాల్సి వస్తుంది. వాస్తుకు ఫ్రెండ్, లంచం అనే నిక్ నేమ్ తో ఉన్న లాయ‌ర్ అయిన కౌశిక్ (రాగ్ మ‌యూర్‌) ఆ కోటి సంపాదించే పనిలో ఉండగా తాత కోసం కొన్న కూల్ డ్రింక్ కీడా కోలాలో బొద్దింక‌ కనిపిస్తుంది. దాన్ని చూపించి కన్స్యూమర్ ఫారంలో కేసు వేసి య‌జ‌మానిని బెదిరించి 5 కోట్లు లాగాలని చూస్తారు. అయితే నిజానికి వీరికి సంబంధం లేని వార్డు మెంబర్ జీవ‌న్ (జీవ‌న్‌)కి కార్పొరేట‌ర్ కావాల‌నే ఆశ‌తో 20 ఏళ్లు జైల్లో ఉండి బ‌య‌టికి వ‌చ్చిన త‌న అన్న భక్త నాయుడు (తరుణ్ భాస్కర్) తో ఆ ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. జీవ‌న్ కార్పొరేట‌ర్ కావాలంటే డబ్బు అవ‌స‌రం కావ‌డంతో ఆ డబ్బు కోసం నాయుడు పనిచేసే కోలా కంపెనీ సీసాలో బొద్దింక వేస్తాడు. ఆ బొద్దింకను చూపించి డబ్బు కొట్టేయాలని అనుకుంటే ఆ సీసా వాస్తు అండ్ కో చేతికి వెళుతుంది. ఈ క్రమంలో ఆ సీసా కోసం వాస్తు అండ్ కోని నాయుడు అండ్ కో ఛేజ్ చేస్తుంది. మరో పక్క కీడా కోలా సీఈవో (రవీంద్ర విజయ్) తన మేనేజర్ షార్ట్స్(రోడీస్ రఘు)ని కూడా రంగంలోకి దించుతాడు. ఇలా ఎవరికీ వారు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? డ‌బ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్‌, జీవ‌న్ గ్యాంగ్ చేతులు ఎందుకు క‌లిశారు? వీరి డబ్బు అవసరాలు తీరాయా?  చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే మూవీ చూడక తప్పదు.

మూవీ విశ్లేషణ.. 

కూల్ డ్రింక్ లో బొద్దింక పడిందని కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి డబ్బులు లాగుదాం అనే సింపుల్ లైన్ తో తెరకెక్కిన సినిమా ఇది. అనుకుంటే పరమ రోటీన్ క్రైమ్ కామెడీగా కూడా దీన్ని తీయొచ్చు. కానీ తరుణ్ భాస్కర్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఉన్న కథనే కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేశాడు. సినిమాలో ఫస్ట్ సీన్ నుంచే తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ మొదలైపోయింది. లాస్ట్ సీన్ వరకు అది ఆగలేదు.. కొన్ని సీన్స్ అయితే పడి పడి నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. సెకండాఫ్ మాత్రం ఒక్క నిమిషం కూడా ఆగకుండా పరిగెత్తింది.. క్రేజీ కామెడీతో సినిమాను పరుగులు పెట్టించాడు తరుణ్ భాస్కర్.

ముఖ్యంగా రీమిక్స్ పాటలకు పగలబడి నవ్వుతారు. ఈ సినిమాకు డైలాగ్స్, సన్నివేశాలు ప్రాణం అయితే రీ రికార్డింగ్ ఆత్మ లాగా నిలబెట్టింది. క్లైమాక్స్ కూడా అందరికీ నచ్చేలా ఉంది. లాజిక్స్ పక్కనబెట్టి చూస్తే కీడా కోలాని హ్యాప్పీగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే తరుణ్ భాస్కర్ ముందు సినిమాల్లో ఉన్నంత బలమైన కథ గానీ, కథనం గానీ ‘కీడా కోలా’లో కనిపించలేదు. పార్టులు పార్టులుగా సీన్లు నవ్విస్తాయి. అయితే క్యారెక్టరైజేషన్లను బేస్ చేసుకుని బలమైన, కొత్త కథను రాయడంలో తరుణ్ భాస్కర్ అంచనాలను అందుకోలేదు.

ఎవరెలా చేశారంటే.. 

నాయుడు పాత్రలో తరుణ్ భస్కర్ అదరగొట్టాడు. మొదట నుంచి సినిమాలో ఎవరూ హీరో లేరని చెప్పి చివరికి తానే హీరో అవ్వడం విశేషం. నత్తి ఉన్న పాత్రలో చైతన్య రావు అద్భుతంగా నటించాడు. ఇక హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో ఆయనకి ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా కేవలం హావభావాలతోనే ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు. సినిమా అంతా వీల్ చైర్ లోనే ఉండి యూరిన్ పైప్ పెట్టుకున్న ఓ పేషంట్ లా కనిపించి అందర్నీ నవ్వించారు. లాయర్ పాత్రలో రాగ్ మయూర్, జీవన్, జీవన్ అసిస్టెంట్ పాత్రలో విష్ణు కడుపుబ్బా నవ్విస్తారు. మధ్యలో గెటప్ శ్రీను యాడ్స్ చేసే హీరోలా కాసేపు కనిపించి మెప్పిస్తాడు. మిగిలిన పాత్రలు కూడా ప్రేక్షకులని మెప్పిస్తాయి. అలానే తరుణ్ భాస్కర్ సినిమాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఈ సినిమా లోనూ టెక్నికల్ స్టాండర్డ్స్ కనిపించాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ బావున్నాయి. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. వివేక్ సాగర్ సంగీతంలో క్వాలిటీ ఉంది. సౌండ్ మిక్సింగ్, డిజైన్ బావున్నాయి. కానీ, కొన్నిసార్లు సన్నివేశాలకు నేపథ్య సంగీతానికి సంబంధం లేదనిపిస్తుంది.

కంక్లూజన్.. 

నవ్విస్తుంది..

ఇవి కూడా చదవండి: