Burglars Flee with ATM: క్యాష్ దొంగిలించడం కష్టమై మొత్తం ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు..
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఏటీఎం కియోస్క్‌లోని క్యాష్ చెస్ట్‌ను తెరిచేందుకు కష్టపడ్డ దొంగల ముఠా చేసేదేమీ లేక మొత్తం ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున బిచ్కుంద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం కియోస్క్‌లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు మెషిన్‌లో నగదు ఉందని గుర్తించారు
Burglars Flee with ATM: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఏటీఎం కియోస్క్‌లోని క్యాష్ చెస్ట్‌ను తెరిచేందుకు కష్టపడ్డ దొంగల ముఠా చేసేదేమీ లేక మొత్తం ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున బిచ్కుంద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం కియోస్క్‌లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు మెషిన్‌లో నగదు ఉందని గుర్తించారు కానీ నగదు చెస్ట్‌ను తెరిచేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీనితో వారు మొత్తం యంత్రాన్ని పెకలించి దానితో పారిపోయారు.
మహారాష్ట్ర ముఠా..(Burglars Flee with ATM)
తెల్లవారుజామున 3.30 గంటలకు సెక్యూరిటీ అలారం మోగిడంతో బ్యాంక్ మేనేజర్ పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వచ్చే సమయానికి ముఠా అక్కడి నుంచి పారిపోయింది. బాన్సువాడ డీఎస్పీ, బిచ్కుంద సర్కిల్ ఇన్‌స్పెక్టర్, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. ఏటీఎం కేంద్రం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ ఘటన వెనుక మహారాష్ట్రకు చెందిన ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా ఏటీఎం మిషన్‌ను తీసుకెళ్లేందుకు నాలుగు చక్రాల వాహనాన్ని వినియోగించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
2021 ఫిబ్రవరిలో ఆదిలాబాద్ పట్టణంలో ఇదే విధమైన సంఘటన జరిగింది, పోలీసు స్టేషన్‌కు ఆనుకుని ఉన్న మరియు రద్దీగా ఉండే కలెక్టరేట్ సర్కిల్‌లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను దొంగలు ఎత్తుకెళ్లారు. తరువాత దొంగలు నగదును తీసుకుని తీసుకొని మిగిలిన యంత్రాన్నిఆదిలాబాద్ రూరల్ మండలంలోని బట్టిసావర్గావ్ గ్రామశివార్లలో పడేసారు. నిజామాబాద్‌లోనూ గత అక్టోబర్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. యంత్రాన్ని తెరిచేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో మొత్తం ఏటిఎంను ఎత్తుకెళ్లాలని భావించారు. అయితే స్థానికులు అప్రమత్తమవడంతో వారు పారిపోయారు.