RBI Monetary Policy: ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్ష.. రెపో రేటు యధాతథం..
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వుబ్యాంకు కీలక ... రేపో రేటును యధాతథంగా కొనసాగించడానికి నిర్ణయించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్ష 4:2 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
RBI Monetary Policy: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వుబ్యాంకు కీలక … రేపో రేటును యధాతథంగా కొనసాగించడానికి నిర్ణయించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ద్రవ్యపరపతి సమీక్ష 4:2 మెజారిటీతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రెపో రేటు 6.5 శాతం..(RBI Monetary Policy)
ఆరుగురు సభ్యుల కలిగిన ఈ ద్రవ్యపరపతి సమీక్షలో నలుగురు సభ్యులు రెపో రేటు లేదా కీలక వడ్డీరేటును 6.5 శాతం కొనసాగించాలని నిర్ణయించారు. కాగా వరుసగా గత ఎనిమిది ద్వైపాక్షిక సమావేశాల నుంచి రెపో రేటు 6.5 శాతంగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఆర్‌బీఐ ముందుగా అంచనా వేసిన ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్దిరేటును 7.2 శాతం నుంచి 7 శాతానికి సవరించింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటును తరిగి 4.5 శాతానికి సవరించింది. ఇదిలా ఉండగా ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించడంతో స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్ పండి లాభాలతో ముగిసింది. కాగా స్టాక్ మార్కెట్లు లోకసభ ఫలితాల తర్వాత భారీ నష్టాలతో కూరుకుపోయిన విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మిత్రపక్షాల మద్దతుతో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుండటంతో స్టాక్ మార్కెట్లు క్రమంగా పుంజుకొని ఆల్‌టైం రికార్డు సృష్టించింది. దీనికి తోడు ఆర్‌బీఐ రెపోరేటు కూడా యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించడం కూడా మార్కెట్‌లో సెంటిమెంట్ మరింత బలపడింది.
అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం వచ్చే అక్టోబర్ నుంచి ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీనికి వారు చెబుతున్న కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు యూరోప్ కూడా క్రమంగా బలపడుతోందని.. అదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి రావచ్చునని చెబుతున్నారు. ఆర్‌బీఐ కూడా రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం నుంచి 4 శాతానికి దిగిరావచ్చునని ద్రవ్యపరపతి సమీక్ష తర్వాత గవర్నర్ శక్తకాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వచ్చే అక్టోబర్ నుంచి ఆర్‌బీఐ వడ్డీరేట్లలో కోత విధించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిస్ ప్రధాన ఆర్థిక వేత్త ధర్మకీర్తి జోషి చెప్పారు.