Telangana Assembly Election 2023 : తెలంగాణలో జోరుగా పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 36.68 శాతం పోలింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 119 నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 119 నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 7.78శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని సెలెబ్రిటీలలో పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు.
LIVE NEWS & UPDATES
-
కామారెడ్డిలో కొనసాగుతున్న హైటెన్షన్.. కొండల్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్
కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి.. కాంగ్రెస్ నేతలకు మధ్య చెలరేగిన వివాదం.. ఉద్రిక్తతల నేపథ్యంలో కొండల్‌రెడ్డిని నియోజకవర్గం నుంచి పంపేసిన పోలీసులు. కాసేపట్లో కామారెడ్డికి వెళ్లనున్న రేవంత్‌రెడ్డి
-
సాయంత్రం 5:30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ - ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని మార్చింది. సాయంత్రం 5:30కే విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఆయా సర్వే సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయనున్నాయి.
-
షాద్ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న బండ్ల గణేష్
నిర్మాత బండ్ల గణేష్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని 248 పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
కుటుంబ సమేతంగా ఓటేసిన హరీశ్ రావు
సిద్దిపేటలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తనయుడు అర్చిస్ మాన్, సతీమణి శ్రీనితతో కలిసి ఓటు వేశారు హరీశ్. గతం కంటే రాష్ట్రంలో పోలింగ్ మెరుగ్గా ఉందని, ప్రజలంతా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారని చెప్పారు హరీశ్.
-
సత్తెంపేటలో పోలింగ్ బహిష్కరించిన గ్రామస్థులు
సత్తుపల్లి మండలం సత్తెంపేటలో గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్న తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదని.. దీంతో మూకుమ్మడిగా అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమకు హామీ ఇచ్చిన వారికే ఓట్లు వేస్తామని గ్రామ ప్రజలు తేల్చి చెబుతున్నారు.
-
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ షర్మిల, విజయ శాంతి
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి జూబ్లిహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే కాలనీలోని యూరో కిడ్స్ స్కూల్ 159 నెంబర్ పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
ఓటు హక్కును వినియోగించుకున్న సినీ ప్రముఖులు
-
ఆక్సీజన్ సిలిండరుతో వచ్చి ఓటు వేసిన వ్యక్తి
తెలంగాణ ఎన్నికల పోలింగ్ వేళ అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య తీవ్రమైన లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్‌తో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలిలోని జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లోని పోలింగ్ కేంద్రంలో శేషయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న అక్కినేని నాగార్జున ఫ్యామిలీ..
సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు అంతా కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45, గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పోలింగ్ నెంబర్ 151 కేంద్రంలో భార్య అమల, కుమారుడు నాగచైతన్యలతో కలిసి ఓటు వేశారు.
-
ఓటు వేసిన బీజేపీ నేత బండి సంజయ్
కరీంనగర్ నియోజకవర్గం బీజేపీ ఆభ్యర్థి బండి సంజయ్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి కరీంనగర్‌లో ఓటు వేశారు. తెలంగాణ ప్రజలందరూ తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని కోరారు. నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుందనే భావనలో ఎవరూ ఉండొద్దని సూచించారు.
-
ఓటు వేసిన దర్శకుడు రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి షేక్‌పేట ఇంటర్నేషనల్ స్కూల్లో సతీమణి రమతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
We did?
DID YOU?
Be a proud voter..💪🏽 🇮🇳 pic.twitter.com/LRy9bdS3HV— rajamouli ss (@ssrajamouli) November 30, 2023
-
ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్ రెడ్డి..
కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. కొడంగల్ నియోజకవర్గంలో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలోని సౌత్ వింగ్ పోలింగ్ కేంద్రంలోని బూత్ నెం.237లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రేవంత్ రెడ్డి.
-
ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్
బంజారాహిల్స్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు..మంత్రి కేటీఆర్. పట్టణ, నగర ప్రజలంతా ఇళ్లనుండి బయటకు వచ్చి ఓటు వేయాలని సూచించారు. ఓటు వేసి మీ హక్కును కాపాడుకోవాలని కోరారు కేటీఆర్.