Last Updated:

Deputy CM Pawan kalyan comments: అద్బుతాలు చేస్తామని చెప్పం కాని జవాబుదారీ తనంతో నడుచుకుంటాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే నియోజకవర్గానికి వచ్చానన్నారు.

Deputy CM Pawan kalyan comments: అద్బుతాలు చేస్తామని చెప్పం కాని జవాబుదారీ తనంతో నడుచుకుంటాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Deputy CM Pawan kalyan comments: ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే నియోజకవర్గానికి వచ్చానన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.

తక్కువ మాటలు.. ఎక్కువ పని (Deputy CM Pawan kalyan comments)

ప్రభుత్వంలో తాను కీలక శాఖలు తీసుకున్నానని, వాటి అధ్యయనానికి, అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతోందని వివరించారు. మాటలు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలన్నది తన అభిమతమన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా జీతం తీసుకుని పనిచేయాలని అనుకున్నా.. కానీ శాఖలో నిధులు లేవన్నారు. అందుకే గత నెలకు సంబంధించిన నాలుగైదు రోజుల జీతానికి సంబంధించిన ఫైల్ పై సంతకం పెట్టడానికి మనసు ఒప్పలేదని.. అందుకే తనకు జీతం ఏమీ వద్దని అధికారులకు చెప్పానన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియదని.. ఈ శాఖలో నిధులు లేకున్నా అప్పటి సీఎం మాత్రం రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడని విమర్శించారు. ఇదంతా చూశాక ప్రజలకు తాను మాట ఇస్తున్నానని.. పంచాయతీ రాజ్ శాఖలో తనవైపు నుంచి ఎలాంటి అవినీతికి తావుండదని స్పష్టం చేశారు.

గోదావరి ఉన్నా.. తాగునీరు లేదు

పక్కనే గోదావరి పారుతున్నప్పటికీ గోదావరి జిల్లాల్లో చాలాచోట్ల తాగడానికి మంచినీళ్లు దొరకడంలేదన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం వాటిని ఉపయోగించలేదన్నారు. అడగడమే ఆలస్యంగా కేంద్రం నిధులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నప్పటికీ మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. రాబోయే ఐదేళ్లలో అద్భుతాలు చేసి చూపిస్తామని చెప్పను కానీ ప్రభుత్వం జవాబుదారీతనంతో నడుచుకుంటుందని గట్టిగా చెప్పగలనన్నారు. నా దేశం కోసం, నా నేల కోసం పనిచేస్తానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తానున్నట్లు స్పష్టం చేశారు. యాత్రలు చేసి, విజయాన్ని గొప్పగా చాటుకోవాలని తనకు లేదన్నారు. మంత్రిగా సంబంధిత శాఖలను తీర్చిదిద్ది, పిఠాపురం నియోజకవర్గంను దేశానికి రోల్ మోడల్ గా అభివృద్ధి చేయాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. పనిచేసి మన్ననలు పొందాలని తాను భావిస్తున్నానని తెలిపారు.

ఇవి కూడా చదవండి: