Vanitha Vijay Kumar : తమిళ నటి వనితా విజయ్ పై దాడి .. బిగ్ బాస్ రివ్యూ వల్లేనా ..
తమిళ యాక్ట్రెస్ వనితా విజయ్ కుమార్ నిత్యం కాంట్రవర్సీలతో వైరల్ అవుతూనే ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న తమిళ బిగ్‌బాస్ 7లో ఈమె కుమార్తె ‘జోవిక’ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక జోవికని సపోర్ట్ చేస్తూ ఆమె చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. హౌస్ లో జోవిక
Vanitha Vijay Kumar : తమిళ యాక్ట్రెస్ వనితా విజయ్ కుమార్ నిత్యం కాంట్రవర్సీలతో వైరల్ అవుతూనే ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న తమిళ బిగ్‌బాస్ 7లో ఈమె కుమార్తె ‘జోవిక’ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక జోవికని సపోర్ట్ చేస్తూ ఆమె చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. హౌస్ లో జోవిక ప్రదీప్ మధ్య జరిగే గొడవలు మీద వనితా కామెంట్స్ చేస్తూ వస్తుంటారు. అయితే బిగ్‌బాస్ చూసే ఆడియన్స్ కంటెస్టెంట్స్ ని సినిమా స్టార్స్ లాగానే అభిమానిస్తుంటారని అందరికి తెలిసిందే.
ఈక్రమంలోనే ఒకరి ఫ్యాన్స్ మరొకరి పై కామెంట్స్ చేసుకుంటూ నెట్టింట ఫ్యాన్ వార్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్ వలనే వనితా పై దాడి చేసే పరిస్థితి ఎదురైంది . ప్రస్తుతం వనితా గాయాలు పాలైనట్లు తెలుస్తుంది. వనితా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేశారు. ఆ పోస్టులో వనితా గాయాలతో కనిపిస్తున్నారు. తన మీద దారుణమైన దాడి జరిగిందని, బిగ్‌బాస్ అనేది కేవలం గేమ్ మాత్రమేనని, వైలెన్స్ కరెక్ట్ కాదని.. ఆ పోస్టు కింద రాసుకొచ్చారు. ఆమె పై ఎవరు దాడి చేశారు అనే దాని పై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ దాడికి బిగ్‌బాస్ అభిమానులే కారణమని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లి బయటకి వచ్చినప్పటి నుంచి ప్రతి సీజన్ కి యూట్యూబ్ లో రివ్యూస్ చేసే వనిత విజయ్ కుమార్ గత రాత్రి ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాకా… రివ్యూ చెప్పి… డిన్నర్ చేసి అర్ధరాత్రి 1 గంటకి కార్ పార్కింగ్ వైపు వాకింగ్ చేస్తుంటే… ఎవరో గుర్తు తెలియని వ్యక్తి “రెడ్ కార్డ్” ఇస్తారా అంటూ దాడి చేసాడట. ఈ విషయాన్నీ వనిత విజయ్ కుమార్ సోషల్ మీడియాలో గాయాలైన తన ఫోటోతో సహా పోస్ట్ చేసింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటూ కొంతమంది, ఇందులో నిజం లేదు అంటూ మరికొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు. ఆమెకు ఎంతోమందితో గొడవలున్నాయి, బిగ్‌బాస్ వల్లే దాడి జరిగిందని మీరు ఎలా డిసైడ్ చేస్తారంటూ క్యూస్షన్ చేస్తున్నారు. అయితే ఆమె పోస్ట్ కింద బిగ్‌బాస్ అని రాసుకురావడంతో.. ఆ కోణంలోనే అందరూ ఈ విషయాన్ని చూస్తున్నారు అని మరో కొంతమంది అంటున్నారు . ఇంతకీ అసలు ఆమె పై దాడి చేయడానికి గల కారణం ఏంటి..? ఆమె పై దాడి చేసిన వారు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు అయితే నెట్టింట వైరల్ గా మారింది