Last Updated:

Tamarind: ఈ ఆరోగ్య సమస్యని చెక్ పెట్టాలి అంటే ఆహారం లో చింతపండు చేర్చాల్సిందే ..

Tamarind: చింతపండు ఈ పేరు వినగానే నోటిలో నీటి ఊట ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు . దీని రుచిని ఇష్టపడని వారే ఉండరు . ఆహారానికి మరింత రుచిని అందించేందుకు మనం వంటల్లో ఉపయోగించే చింతపండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. చింతపండు యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్ హౌస్‌గా

Tamarind: ఈ ఆరోగ్య సమస్యని చెక్ పెట్టాలి అంటే ఆహారం లో చింతపండు చేర్చాల్సిందే ..

Tamarind: చింతపండు ఈ పేరు వినగానే నోటిలో నీటి ఊట ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు . దీని రుచిని ఇష్టపడని వారే ఉండరు . ఆహారానికి మరింత రుచిని అందించేందుకు మనం వంటల్లో ఉపయోగించే చింతపండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. చింతపండు యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్ హౌస్‌గా చెబుతారు. చింతపండులో విటమిన్లు సి, ఇ, బి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ కూడా ఉన్నాయి. చింతపండు రెగ్యులర్ గా తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి .

ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే చింతపండును చేర్చుకోవడం వల్ల అజీర్తిని మెరుగుపరచడానికి, ఆరోగ్య రక్షించడానికి సహాయపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చింతపండులో ఉండే పాలీఫెనోలిక్ సమ్మేళనాలు అల్సర్‌లను నివారించడంలో సహాయపడతాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చింతపండును ఆహారంలో చేర్చుకోవడం మంచిది.చింతపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చింతపండును ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆకలిని తగ్గించి బరువు తగ్గించుకోవచ్చు. వాటిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. చింతపండు నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

చింతపండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పొటాషియం పుష్కలంగా ఉండే చింతపండు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఎ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న చింతపండును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుతుంది. మెగ్నీషియం అధికంగా ఉండే చింతపండు నిద్రలేమికి కూడా సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండే చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది.