Last Updated:

Leo Movie Review : దళపతి విజయ్ “లియో” మూవీ రివ్యూ, రేటింగ్ ???

Leo Movie Review : దళపతి విజయ్ “లియో” మూవీ రివ్యూ, రేటింగ్ ???

Cast & Crew

  • దళపతి విజయ్ (Hero)
  • త్రిష (Heroine)
  • సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు (Cast)
  • లోకేష్ కనగరాజ్ (Director)
  • ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి (Producer)
  • అనిరుధ్ రవిచందర్ (Music)
  • మనోజ్ పరమహంస (Cinematography)
3.2

Leo Movie Review : దళపతి విజయ్ కి తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇక తమిళనాట అయితే రజినీ కాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హయివ్ అంటే విజయ్ అనే చెప్తారు. ఈ క్రమంలోనే ఆయన సినిమా రిలీజ్ అంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇక ఇప్పుడు విజయ్.. నటించిన లేటెస్ట్ మూవీ “లియో”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు పోషించారు.  కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్.. లియోని (Leo Movie) కూడా ఆ సినిమాలతో లింకు చేశారా ? లేదా?? అనే డౌట్ ఈ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఈ మేరకు దసరా కానుకగా నేడు తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా రివ్యూ, రేటింగ్ ???

మూవీ కథ.. 

హిమాచల్ ప్రదేశ్‌లోని థియోగ్‌లో పార్థీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుకుంటూ ఉంటాడు. తన భార్య సత్య (త్రిష), పిల్లలతో హాయిగా జీవితాన్ని సాగిస్తుంటాడు. పార్థీబన్‌కు ఫారెస్ట్ అధికారి జోషి (గౌతమ్ మీనన్)కు స్నేహం ఉంటుంది. యానిమల్ రెస్క్యూ విషయంలో పార్థీబన్ ఎప్పుడూ ముందుంటాడు. అలా ఓ సారి ఆ ఊర్లోకి వచ్చిన హైనాను కాపాడతాడు. అలా పార్థీబన్ పేరు మార్మోగిపోతుంది. మరోసారి తన కాఫీ షాప్‌లో వచ్చిన దుండగలను అంతమొందిస్తాడు. అలా మళ్లీ పార్థీబన్ పేరు ట్రెండ్ అవుతుంది. పార్థీబన్ పేరు, ఫోటోలు వార్తల్లో హైలెట్ అవుతాయి. అవి చివరకు ఆంటోని దాస్ (సంజయ్ దత్), హరోల్డ్ దాస్ (అర్జున్) కంటపడతాయి. దాస్ అండ్ కో కంపెనీకి, ఆంటోని, హరోల్డ్ దాస్‌లకు పార్థీబన్‌కు ఉన్న రిలేషన్ ఏంటి? అసలు ఈ పార్థీబన్ ఎవరు? లియో దాస్ ఎవరు? ఇద్దరూ ఒక్కరేనా? చివరకు ఏమైంది? అనేది తెలియాలి అంటే సినిమా చూడక తప్పదు.

సినిమా విశ్లేషణ (Leo Movie Review)..

గతాన్ని వీడి హీరో.. తన బతుకు తాను బతకడం. అనుకోకుండా అతని జీవితంలోకి మళ్లీ విలన్ రావడం.. చివరికి హీరో విలన్ ని ఓడించడం.. కథతో చాలానే చిత్రాలు వచ్చాయి. లియో ట్రైలర్ వచ్చినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్, గాయం 2 సినిమాలను చూసినట్టుగా ఉంది.. అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే లియో సినిమా టైటిల్స్ ప్రారంభంలోనే లోకేష్ ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్ సినిమాకు క్రెడిట్ ఇచ్చాడు. కథ పరంగా కొత్తగా లేకపోయినా లోకేష్ కనకరాజ్ మార్క్ యాక్షన్, మేకింగ్ పరంగా అదరగొట్టాడు. అయితే ఖైదీలో పాప ఎమోషన్, విక్రమ్‌లో చిన్న పిల్లాడితో ఎమోషన్ అయినంత బాగా ఈ మూవీలో ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోవచ్చు.

ప్రథమార్దంలోని మొదట పది నిమిషాలు మాత్రం గ్రిప్పింగ్‌గా అనిపిస్తుంది. హైనా సీక్వెన్స్ హైలెట్‌ అనిపిస్తుంది. ఆ తరువాత కాస్త స్లోగా అనిపిస్తుంది. కాఫీ షాపులోని ఫైట్, పోలీస్ స్టేషన్‌లోని సీక్వెన్స్ హై ఇస్తుంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్, ఆ టైంలో వచ్చే ఆర్ఆర్ అద్భుతంగా అనిపిస్తుంది. కానీ పార్థీబన్ తన ఫ్యామిలీ కోసం .. వాళ్ళని కాపాడుకునేందుకు ఎంత దూరమైన వెళ్ళడం బాగా చూపించారు. ఇక ద్వితీయార్దంలో లియో ఫ్లాష్ బ్యాక్ ఓకే అనిపిస్తుంది. ఆ తరువాత ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కోసం రాసుకున్న భారీ యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది.

అదే విధంగా ఖైదీ సినిమాలోని నెపోలియన్‌ను లియోకు తీసుకొచ్చి.. లింక్ కలిపిన విధానం బాగుంటుంది. నెపోలియన్ మరోసారి ఇందులో అదరగొట్టేశాడు. చివరకు లియోకి, విక్రమ్ (కమల్ హాసన్) కాల్ చేయడంతో నెక్ట్స్ పార్ట్ మీద హైప్ క్రియేట్ చేసేశాడు లోకేష్. ఎల్‌సీయూలో భాగంగా వచ్చిన ఖైదీ, విక్రమ్‌ల రేంజ్‌లో లియో ఆకట్టుకోకపోయినా.. విజయ్ ఫ్యాన్స్‌కు మాత్రం పండుగలా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే.. 

స్టార్‌డమ్, కమర్షియల్ అంశాలు వంటివి పక్కన పెట్టి మరీ విజయ్ చేసిన చిత్రమిది. గతంలో ‘తెరి’ సినిమాలో చిన్న పాపకు తండ్రిగా కనిపించగా.. ఈసారి టీన్ ఏజ్ అబ్బాయికి తండ్రిగా నటించారు. విజయ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. త్రిష తల్లి పాత్రలో ఒదిగిపోయారు. విజయ్, త్రిష జోడీ… భార్యాభర్తలుగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బావుంది. అన్నట్టు మాంచి ఎమోషనల్ సన్నివేశంలో లిప్ లాక్ ఉంది. ఇద్దరు పిల్లలు చక్కగా నటించారు. ఆంటోనీ దాస్ పాత్రలో సంజయ్ దత్, హరోల్డ్ దాస్ పాత్రలో అర్జున్ సర్జాకు ఇచ్చిన ఇంట్రడక్షన్స్ బావున్నాయి. అయితే… ఆ పాత్రలకు ఇచ్చిన ఎండింగ్ కానీ, హీరోతో వాళ్ళ సన్నివేశాలు గానీ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఉండవు. గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రియా ఆనంద్ అతిథిలా చిన్న పాత్రలో తళుక్కున మెరిశారు. మడోన్నా సెబాస్టియన్ కు కథను మలుపు తిప్పే మంచి పాత్ర లభించింది. మిగతా వాళ్ళు ఓకే. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ గా ఉంది. ‘లియో’ మూవీ అంతా డిఫరెంట్ లైటింగ్ తో మూడ్ సెట్ చేశారు. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం బావుంది. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.

కంక్లూజన్.. 

ఆ రేంజ్ కాకపోయినా.. కుమ్మేశాడు

ఇవి కూడా చదవండి: