Last Updated:

Samsung Galaxy A16 5G: సామ్‌‌సంగ్ బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు చాలా ప్రీమియం.. లాంచ్ ఎప్పుడంటే!

Samsung Galaxy A16 5G: సామ్‌‌సంగ్ బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు చాలా ప్రీమియం.. లాంచ్ ఎప్పుడంటే!

Samsung Galaxy A16 5G: టెక్ బ్రాండ్ సామ్‌సంగ్ తన కొత్త గెలాక్సీ A16 5Gని త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల కంపెనీ గ్లోబల్ సైట్‌లో లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ A15 5Gకి సక్సెసర్‌గా మార్కెట్‌లో సందడి చేయనుంది. దీని ముందు వేరియంట్‌తో పోలిస్తే కంపెనీ దీనికి పెద్ద స్క్రీన్, బ్యాటరీ, అనేక ఇతర గొప్ప ఫీచర్లను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని ప్రధాన ఫీచర్లు, కలర్ వేరియంట్లలో రానుంది.

గెలాక్సీ A16 5Gని త్వరలో లాంచ్ చేయనున్నట్లు సామ్‌సంగ్ ధృవీకరించింది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా కన్ఫామ్ చేయలేదు. ఇది భారతదేశంలో మూడు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. ఇందులో బ్లూ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ కలర్స్ ఉన్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ A16 5G గ్లోబల్ మార్కెట్‌లో మిడ్-రేంజ్ ఫోన్ సెగ్మెంట్‌లో విడుదల కానుంది. ఎంపిక చేసిన మార్కెట్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ 4GB + 128GB వేరియంట్ ధర 249 యూరోలు (EUR 249) అంటే సుమారు రూ. 23,000గా ఉంటుంది. అయితే ఈ అప్ కమింగ్ ఫోన్ ఇండియాలో దీని కంటే తక్కువ ధరకే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy A16 5G Features
గ్లోబల్ వేరియంట్ వలె సామ్‌సంగ్ గెలాక్సీ A16 5G భారతదేశంలో కూడా 6 OS అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల భద్రతా అప్‌డేట్‌లను పొందుతుంది. ఇండియన్ మోడల్ డిజైన్, దాని ప్రత్యేకతలు కూడా గ్లోబల్ వేరియంట్‌ను పోలి ఉంటాయి. ఫోన్ IP54-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. ఐలాండ్ ఫీచర్ కూడా ఉంటుంది.

ఫోన్‌లో MediaTek చిప్‌సెట్ (డైమెన్సిటీ 6300), నాక్స్ సెక్యూరిటీ ఫీచర్లు, సూపర్ AMOLED స్క్రీన్ ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇది అల్ట్రా-వైడ్ లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైంది.

గ్లోబల్ వేరియంట్ Exynos 1330 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల పూర్తి HD + సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14-ఆధారిత One UI 6.1పై రన్ అవుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా గురించి మాట్లాడితే.. గ్లోబల్ వేరియంట్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిగి ఉంది. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఉంది. ఇది డ్యూయల్ 5G, NFC, GPS, బ్లూటూత్ 5.3, Wi-Fi, USB టైప్-C కనెక్టివిటీకి ఫీచర్లతో వస్తుంది.