Last Updated:

Kotabommali PS Movie Review : “కోట బొమ్మాళి పీఎస్” మూవీ రివ్యూ, రేటింగ్ ?

Kotabommali PS Movie Review : “కోట బొమ్మాళి పీఎస్” మూవీ రివ్యూ, రేటింగ్ ?

Cast & Crew

  • శ్రీకాంత్, రాహుల్ విజయ్ (Hero)
  • శివానీ రాజశేఖర్ (Heroine)
  • వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ, పవన్ తేజ్ కొణిదెల, బెనర్జీ తదితరులు (Cast)
  • తేజ మార్ని (Director)
  • 'బన్నీ' వాస్, విద్యా కొప్పినీడి (Producer)
  • రంజిన్ రాజ్ (Music)
  • జగదీశ్ చీకటి (Cinematography)
3

Kotabommali PS Movie Review : సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి PS’. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. ‘జోహార్’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తేజ మార్ని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జీఏ2 పిక్చ‌ర్స్‌ బ్యానర్​లో రూపొందుతోన్న ఈ మూవీలోని ‘లింగిడి లింగిడి…’ పాట జనాల్లోకి బాగా వెళ్ళింది. దాంతో ‘కోట బొమ్మాళి పీఎస్’పై ప్రేక్షకుల చూపు పడింది. మలయాళ హిట్ ఫిల్మ్ ‘నాయట్టు’కు రీమేక్ ఇది. అయితే… తెలుగుకు మార్పులు, చేర్పులు చేశారు. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..?

సినిమా కథ.. 

ఏపీలోని టెక్కలి ఉపఎన్నికను అధికార పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. హోమ్ మంత్రి బరిసెల జయరామ్ (మురళీ శర్మ)ను రంగంలోకి దించుతుంది. అయితే… అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణిస్తాడు. పెళ్లిలో మద్యం సేవించి వస్తున్న పోలీస్ జీప్ యాక్సిడెంట్ చేయడంతో అతను మరణిస్తాడు. ఆ జీపులో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ (శ్రీకాంత్), కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుల్ రవి (రాహుల్ విజయ్), మహిళా కానిస్టేబుల్ కుమారి (శివానీ రాజశేఖర్) ఉంటారు. అయితే… జీపు నడిపింది వాళ్ళు కాదు. కానీ, ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు స్టేషనులో కుమారికి వరుసకు బావ అయ్యే మున్నా (పవన్ తేజ్ కొణిదెల)తో పాటు మరణించిన సామజిక వర్గానికి చెందిన కొందరితో రామకృష్ణ, రవి గొడవ పడతారు. దాంతో యాక్సిడెంట్ కాస్త రాజకీయ సమస్యగా మారుతుంది.

రామకృష్ణ.. రవి, కుమారిలను తీసుకుని పరారీ అవుతాడు. మరోవైపు ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని హోమ్ మంత్రి శపథం చేస్తారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్ కుమార్)కు ఆ బాధ్యత అప్పగిస్తారు. ఆ తర్వాత ఏమైంది? పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రామకృష్ణ ఏం చేశాడు? అతడిని పట్టుకోవడానికి రజియా ఏం చేసింది? అంతిమ విజయం ఎవరిది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

మూవీ విశ్లేషణ..

ఇటీవల కాలంలో రీమేక్‌ చిత్రాలు అంతగా ఆడటం లేదు. ఓటీటీలో వస్తుండటంతో ఆడియెన్స్‌ ఆల్‌రెడీ చూస్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో `కోటబొమ్మాళి పీఎస్‌`తో ఓ సాహసమే చేశారని చెప్పొచ్చు. పోలీసులను, చట్టాలను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు, వారి అధికారం కోసం అధికారులను, ముఖ్యంగా పోలీసులను ఎలా పావుగా వాడుకుంటారనే దానికి ఈ మూవీ నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ సినిమా ఆద్యంతం రేసీగా సాగుతుంది. రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం పడే పాట్లు, ఎలక్షన్ల సమయంలో పోలీసులు పడే పాట్లని ఇందులో చూపించారు. వాటిని చాలా రియలిస్టిక్‌గా తీయడంతో ఆయా సన్నివేశాలు బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే ఎక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గాల కోసం రాజకీయ పార్టీలు వేసే ఎరలు వంటివి ఆకట్టుకుంటాయి.

యాస, భాష దగ్గర నుంచి నటీనటుల ఎంపిక వరకు దర్శక – రచయితలు తీసుకున్న జాగ్రత్తల కారణంగా కొత్త సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. ‘నాయట్టు’ చూసిన వాళ్ళకు కొన్ని కంప్లైంట్స్ ఉండటం సహజమే. అయితే… ఆ సినిమా చూడని మెజారిటీ ప్రేక్షకులకు ‘కోట బొమ్మాళి’ నచ్చుతుంది. రాజకీయ నేపథ్యం ఉన్న మూవీ తీసిన అనుభవంతో దర్శకుడు పొలిటికల్ సీన్లుచక్కగా డీల్ చేశారు. రాజకీయ నాయకులను చూపించే విషయంలో ఎక్కడా గీత దాటలేదు. ఫస్టాఫ్ రేసీగా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత ఎమోషనల్ మూమెంట్స్ కూడా రావడంలో స్పీడ్ కొంచెం తగ్గుతుంది. కానీ కథ నుంచి బయటకు వెళ్లకుండా ఎమోషన్స్ ని క్యారీ చేశారు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అందరినీ మెప్పిస్తుంది.

ఎవరెలా చేశారంటే (Kotabommali PS Movie Review)..

శ్రీకాంత్ కు ఈ సినిమా ‘ఖడ్గం’ తరహాలో మరో మెమరబుల్ రోల్ అవుతుంది. సినిమా ప్రారంభంలో రామకృష్ణ క్యారెక్టర్ చూస్తే.. ఓ సాధారణ కానిస్టేబుల్ గా అనిపించినా కథ ముందుకు వెళ్లే కొలదీ హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యింది. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లలా కాకుండా కేవలం పాత్రల్లో ఒదిగిపోయారు. వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ మరోసారి మేనరిజం, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ప్రవీణ్, బెనర్జీ, సీవీఎల్ నరసింహారావు, దయానంద్, పవన్ తేజ్ కొణిదెల తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. నేపథ్య సంగీతం బావుంది. కెమెరా వర్క్ & ప్రొడక్షన్ వేల్యూస్ కూడా బావున్నాయి.

కంక్లూజన్.. 

స్లో పాయిజన్ లాంటి థ్రిల్లర్..

ఇవి కూడా చదవండి: