Dietary Guidelines: భోజనానికి ముందు, తరువాత కాఫీ, టీ తాగడం మానండి.. ఎందుకంటే..
మనలో చాలా మంది ఒకరితో ఒకరు పోటీ పడి కప్పుల కొద్ది కాఫీ, టీలు తాగుతుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి హానికరమని ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) తాజా పరిశోధనలో తేల్చి చెప్పింది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కనీసం ఒక గంట తర్వాత మాత్రమే టీ కానీ కాఫీ కానీ తాగాలని సూచించింది.
Dietary Guidelines: మనలో చాలా మంది ఒకరితో ఒకరు పోటీ పడి కప్పుల కొద్ది కాఫీ, టీలు తాగుతుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి హానికరమని ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) తాజా పరిశోధనలో తేల్చి చెప్పింది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కనీసం ఒక గంట తర్వాత మాత్రమే టీ కానీ కాఫీ కానీ తాగాలని సూచించింది. ఇక టీ, కాఫీలో కెఫెయిన్ ఉంటుంది.. ఇది మన సెంట్రల్ నర్వెస్ సిస్టమ్‌ను ఉత్తేజపరుస్తుంది. దీంతో తరచూ టీ, లేదా కాఫీ తాగాలనిపిస్తుందని ఐసీఎంఆర్ తాజా పరిశోధనలో తేల్చి చెప్పింది. తాజాగా ఐసీఎంఆర్ మొత్తం 17 డైటరీ గైడ్‌లెన్స్ మన ఇండియన్స్ కోసం విడుదల చేసింది. ఆరోగ్యకరమైన జీవితం కోసం బ్యాలెన్డ్స్ డైట్ ఉండాలని సూచించింది.
తక్కువగా తాగాలి..(Dietary Guidelines)
మొత్తం 17 గైడ్‌లైన్స్‌లో ఒకటి టీ లేదా కాఫీ వీలైనంత తక్కువగా తాగాలని సూచించింది. ఇక మనదేశ జనాభాలో మెజారిటి ప్రజలు టీ, కాఫీ తాగనిదే ఉండలేరు. అయితే భోజనం తర్వాత కానీ.. భోజనానికి ముందు కానీ కనీసం ఒక గంట ముందు ఎట్టి పరిస్థితుల్లో టీ, కాఫీ తాగరాదని ఐసీఎంఆర్ హెచ్చరించింది. అయితే ఈ రెండు పానీయాలు తాగకుండా నోరు కట్టేసుకోవాల్సిన పనిలేదు. మోతాదు మించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగరాదని ఐసీఎంఆర్ చెబుతోంది. ఒక కప్పు అంటే 150 ఎంఎల్ కాఫీలో 80 నుంచి 120 ఎంజీ కెఫెయిన్ ఉంటుంది.. అదే ఇన్‌స్టాంట్ కాఫీ లో అయితే 50-65 ఎంజీలు, అదే టీని తీసుకుంటే 30-65 ఎంజీ కెఫెయిన్ ఉంటుంది.
ఐరన్ తగ్గితే ఇబ్బందులే..
మోతాదు మించి టీ, లేదా కాఫీ తాగితే ఆరోగ్యానికి హానికరం. పరిమిత స్థాయిలో అంటే రోజుకు 300 ఎంజీలోపలే ఉండే విధంగా చూసుకోవాలని సూచించింది. అలాగే టీ లేదా కాఫీలో టానిన్ ఉంటుంది. ఎప్పుడైతే కాపీ, లేదా టీ తాగినప్పుడు ఈ టానిన్ మన దేహంలోని ఐరన్‌ను ఈ టానిన్ పీల్చుకుంటుంది. దీన్ని బట్టి తేలిది ఏమిటంటే మనం తినే ఆహారం ఐరన్‌గా మారుతుంది. ఈ ఐరన్‌ను టానిన్ తగ్గిస్తుంది. దీంతో పాటు టానిన్ డైజెస్టివ్ సిస్టమ్‌లో చేరి తేలికంగా అరగించకుండా చేస్తుంది. దీంతో మనం తినే ఆహారం ఐరన్‌గా మారి రక్తంలో కలవకుండా చేస్తుంది. కాగా హెమోగ్లోబిన్ తయారు చేయడానికి ఐరన్ తప్పుకుండా కావాల్సిఉంటుంది. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ ద్వారా మన బాడీలోకి తీసుకువెళాయి. దేహంలో ఐరన్ తగ్గితే రక్తహీనత ఏర్పడుతుంది.
దేహంలో ఐరన్ తగ్గితే… బాడీ త్వరగా అలసిపోతుంది. శక్తి లేకుండా పోతుంది. శ్వాసపీల్చుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతాయి. తరచూ తలనొప్పులు రావడం, తరచూ బలహీనంగా ఉండటంతో, చర్మం పొడిబారిపోవడం, ఎప్పుడు ఐస్ కావాలనిపిస్తుంది. గోళ్లు పెలుసుబారిపోవడం, తలవెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది. చిరుధాన్యాలు, చికెన్, చేపలు తినవచ్చునని సూచించింది. అలాగే ప్రొటిన్ సప్లిమెంట్‌లకు దూరంగా ఉండాలని, నూనె తక్కువ వినియోగించుకుంటూ.. ఆహారంలో చక్కెర, ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది.