Last Updated:

IPL-2024: నేడు చెన్నైలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపిఎల్ల్ ఫైనల్  రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది.

IPL-2024: నేడు చెన్నైలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్

IPL-2024:   ఐపిఎల్ల్ ఫైనల్  రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది. మరికాసేపట్లో చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఈనెల 26న కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనున్నారు. ఇప్పటికే క్వాలిఫయర్-1లో హైదరాబాద్‌ను ఓడించి KKR జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. క్వాలిఫయర్‌-1లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇప్పటికే ఫైనల్స్ కి అర్హత సాధించింది. ఈ క్రమంలో క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం దక్కించుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..రాజస్తాన్‌ రాయల్స్‌తో‌ తాడోపేడో తేల్చుకోనుంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మరికొన్ని గంటల్లో ఈ కీలక మ్యాచ్‌ జరుగనుంది.

RR ను పదిసార్లు ఓడించిన SRH..(IPL-2024)

IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లను పోల్చి చూస్తే, రాజస్థాన్‌పై హైదరాబాద్‌దే-SRH పైచేయి ఉంది. IPLలో RR, SRH మధ్య ఇప్పటివరకు మొత్తం 19 మ్యాచ్‌లు జరగ్గా , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్‌ను 10 సార్లు ఓడించింది. మరోవైపు గెలుపు అంచనా ప్రకారం చూస్తే ఈ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 52 శాతం గెలిచే అవకాశం ఉండగా, రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు 48 శాతం ఛాన్స్ ఉంది. అయితే సన్ రైజర్స్ బలం ఓపనర్లే. ట్రావిస్ హెడ్, అభిషేక్ వర్మ,హెన్రిచ్‌ క్లాసెన్‌ ప్రధాన బలం. వీళ్లు ముగ్గురూ బ్యాట్‌ ఝులిపిస్తే ఆపటం ఎవరితరం కాదు. క్రీజులో ఒక్కసారి పాతుకుపోతే తొలి 8-10 ఓవర్లలోపే మ్యాచ్‌ ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చేస్తారు.ముఖ్యంగా ట్రావిస్‌ హెడ్‌ దంచికొడితే తిరుగే ఉండదు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో వరుసగా అతడు డకౌట్‌ అయ్యాడు.

అయితే చెన్నైలో సాయంత్రం ప్రతికూల వాతావరణం ఉంటుందని ఇప్పటికే వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కు వెళ్లే జట్టు ఏది అనే ప్రశ్న తలెత్తుతోంది. క్వాలిఫయర్-2కి వర్షం ఆటంకం కలిగిస్తే అంపైర్లకు కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి అదనంగా గంటన్నర సమయం ఉంటుంది. తుపాను కారణంగా 5-5 ఓవర్ల మ్యాచ్ కూడా ఆడలేకపోతే అంపైర్ సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దు అవుతుంది

ఇవి కూడా చదవండి: