Last Updated:

HYDRA- GHMC: హైడ్రా, జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. రెండు కమిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

HYDRA- GHMC: హైడ్రా, జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. రెండు కమిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

HYDRA and GHMC Sensational Decision for Protection: హైడ్రా, జీహెచ్ఎంసీ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. హైదరాబాద్ నగరంలో అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు, వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముప్పు తదతర సమస్యల నివారణపై హైడ్రా, జీహెచ్ఎంసీ స్పెషల ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే అగ్ని ప్రమాదాలు, వరద ముంపు నివారణకు రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు నిర్ణయించారు. దీంతో పాటు చెరువుల సంరక్షణ, సుందరీకరణ, పునరుద్ధరణపై చర్చించారు.

కాగా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. వర్షాకాలంలో వరద ముంపు తో పాటు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అలాగే వర్షాకాలంలో చేపట్టే చర్యలు, అగ్ని ప్రమాదాల నివారణపై సమీక్షించారు.

ఇందులో భాగంగా, అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అగ్ని మాపక శాఖ తో పాటు జీహెచ్ఎంసీ, హైడ్రా విభాగాలతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అలాగే, వర్షాకాలంలో అకస్మాత్తుగా వచచే వరద ముంపు రాకుండా చేపట్టే చర్యలతో పాటు ట్రాఫిక వంటి సమస్యలు రాకుండా మరో కమిటీని ఏర్పాటు చేయాలని కమిషనర్లు నిర్ణయించారు. ఈ కమిటీలో ట్రాఫిక్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు ఉంటారు. ఈ రెండు కమిటీలు సమస్యలకు అనుగుణంగా సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటు సమస్యలు మళ్లీ రాకుండా చర్యలు తీసుకునేలా కమిటీ నిర్ణయం తీసుకోనుంది.