Pahalgam Terror Attack: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో సైనికుడు మృతి

Indian Solder killed in Jammu and Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో భద్రతాబలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్‌లో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో గురువారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, సైనికులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డూడూ-బసంత్‌గఢ్ ఏరియాలో ఉగ్రవాదులు తరాస పడడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
చికిత్స పొందుదూ జవాన్ మృతి..
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడికి మెడికల్ టీమ్ సభ్యులు ప్రాథమిక చికిత్స అందిస్తుండగా మృతిచెందారు. ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించింది. కాగా, రెండు రోజుల కింద పహల్గాంలో ఐదుగురు ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా దాడులు చేసి కాల్పులు జరిపారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గత 24 గంటల్లో జరిగిన మూడో ఎన్‌కౌంటర్ ఇది. అంతకుముందు కశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో ఇటీవల ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం పహల్గాంలో సైనిక దుస్తువుల్లో వచ్చిన ఉగ్రవాదులు పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అమాయకుల ప్రాణాలు తీశారు. దాడుల్లో 28 మంది మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ క్రమంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల గాలింపులను ముమ్మరం చేశారు.